వన్డే వరల్డ్‌కప్‌(World Cup)లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి శ్రీలంకకు వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అంత గొప్ప జట్టు వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై కాకపోవడమేమి? 1996 ప్రపంచ కప్‌ను సాధించిన శ్రీలంక. 2007, 2011లో వరల్డ్‌కప్‌ ఫైనల్స్(World Cup Finals) వరకు చేరిన శ్రీలంక(Sri Lanka) ఇప్పుడు నేరుగా వరల్డ్‌కప్‌ అర్హత ఎందుకు సాధించలేకపోయింది?

వన్డే వరల్డ్‌కప్‌(World Cup)లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి శ్రీలంకకు వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అంత గొప్ప జట్టు వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై కాకపోవడమేమి? 1996 ప్రపంచ కప్‌ను సాధించిన శ్రీలంక. 2007, 2011లో వరల్డ్‌కప్‌ ఫైనల్స్(World Cup Finals) వరకు చేరిన శ్రీలంక(Sri Lanka) ఇప్పుడు నేరుగా వరల్డ్‌కప్‌ అర్హత ఎందుకు సాధించలేకపోయింది? అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్‌ జయసూర్య, మహేళ జయవర్ధనే, రోషన్‌ మహనామా, గురుసింఘే, దులీప్‌ మెండిస్‌, రాయ్‌ డయాస్‌, కుమార సంగక్కర, చమిందా వాస్‌, ముత్తయ్య మురళీధరన్‌ ...ఇలా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించిన శ్రీలంక క్రికెట్‌ ఇప్పుడు ఇంతగా దిగజారడాన్ని క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

44 ఏళ్ల తర్వాత లంకకు ఈ పరిస్థితి తలెత్తింది. వరసు ఓటములు శ్రీలంక అవకాశాలను దారుణంగా దెబ్బతిశాయి. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లిన శ్రీలంక అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. రెండు టెస్ట్‌ల్లో పోరాడి ఓడిపోయింది. నిజానికి ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఇండియా గెలవకపోయి ఉంటే శ్రీలంక ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరి ఉండేది. కనీసం న్యూజిలాండ్‌పై విజయం సాధించినా శ్రీలంకకు ఆ ఛాన్స్‌ దక్కేది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్ల తేడాతో ఓడిపోయిన కరుణరత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అలా శ్రీలంక ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆశలను కాలరాసిన న్యూజిలాండ్‌ ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అడుగుపెట్టే ఛాన్స్‌ లేకుండా చేసింది. మొదటి వన్డేలో 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌ మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డే వర్షానికి తుడిచిపెట్టుకుపోయింది. దీంతో వన్డే సిరీస్‌ను దసుక్‌ షనక సేన కోల్పోయింది. ఇక ఇప్పుడు జూన్‌లో జింబాబ్వేలో జరిగే ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో ఓడిపోయిన శ్రీలంక ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అక్టోబరులో వన్డే వరల్డ్‌కప్‌-2023 ఈవెంట్‌ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది..

Updated On 1 April 2023 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story