రెండు నెలలుగా పైగా సాగిన ఐపీఎల్(IPL 2024) టోర్నమెంట్ ఆదివాంర ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి టైటిల్‌ను దక్కించుకుంది. వేలం పాట(Auction) నుంచి మొదలుపెడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడికి వెళ్లి తన టీమ్‌కు ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్(Kavya Maaran) మ్యాచ్ తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
రెండు నెలలుగా పైగా సాగిన ఐపీఎల్(IPL 2024) టోర్నమెంట్ ఆదివాంర ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది. ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి టైటిల్‌ను దక్కించుకుంది. వేలం పాట(Auction) నుంచి మొదలుపెడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడికి వెళ్లి తన టీమ్‌కు ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్(Kavya Maran) మ్యాచ్ తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. టీమ్ పర్ఫార్‌మెన్స్ ఎలా ఉన్నా కేరింతలు కొడుతూ ప్రోత్సహించారు. చిన్నపిల్లలా చప్పట్లు కొట్టారు. ప్రతి బంతికి రియాక్టయ్యారు. టీమ్ పాల్గొన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశారు. కుర్చిలోంచి లేచి గంతులేశారు. చప్పట్లు కొట్టారు. టీమ్ గెలిచిన తర్వాత ఆటగాళ్లను ఆలింగనం చేసుకున్నారు. కొన్ని సందర్భాలలో దిగ్భ్రాంతి చెందారు. తల కూడా పట్టుకున్నారు. అలాంటికావ్య ఆదివారం మాత్రం కన్నీటిని ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నప్పటికీ చప్పట్లు కొట్టారు. కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ టీమ్ ఓడిపోతే పోయి ఉండవచ్చుగాక, కావ్య మారన్ మాత్రం విజయం సాధించారు. కావ్య కన్నీరుపెడుతున్నప్పుడు మ్యాచ్ ఆసాంతం తిలకించిన వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. మొత్తానికి కావ్య మారన్ టీమ్ అందరి మనసులను గెల్చుకుంది. ఈ టోర్నమెంట్‌లో లక్నో సూర్ జెయింట్స్ టీమ్ యజమాని సంజీవ్ గోయింకను ఎంత మంది అసహ్యించుకున్నారో అంతకు రెట్టింపు మంది కావ్యను మెచ్చుకున్నారు. కావ్యకు ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది?