సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో తెలుగు ఆటగాడు నితీష్‌రెడ్డి(nitish reddy) దుమ్ములేపుతున్నాడు. మంగళవారం ముల్లన్‌పూర్(Mullanpur)లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కేవలం 37 బంతుల్లో ఐదు శక్తివంతమైన సిక్సర్లతో సహా 64 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్‌ను అందించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో తెలుగు ఆటగాడు నితీష్‌రెడ్డి(nitish reddy) దుమ్ములేపుతున్నాడు. మంగళవారం ముల్లన్‌పూర్(Mullanpur)లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కేవలం 37 బంతుల్లో ఐదు శక్తివంతమైన సిక్సర్లతో సహా 64 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్‌ను అందించాడు. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 182/9 పరుగులు చేసింది. ఈ స్కోర్‌లో నితీష్‌రెడ్డి ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. 4 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసినా నితీష్ ఇన్నింగ్సే అద్భుతమని చెప్పాలి.
క్లాసెన్, మార్‌క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తాచాటాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో కాస్త సెట్ అయ్యాక భీభత్సం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ నితీష్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టుకు 182 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. కాగా నితీష్ కుమార్‌కు తన ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా నితీష్ ఓ వికెట్ పడగొట్టాడు.
20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003, మే 26న విశాఖపట్నంలో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నితీష్‌కు 14 ఏళ్ల వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీ(2017-18)లో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2020 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం 2021లో లిస్ట్-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్ అడుగుపెట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. కాగా టీ20ల విషయానికి వస్తే.. ఆంధ్రా జట్టు తరపున 8 మ్యాచ్‌లు ఆడిన నితీష్ 106 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీష్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.