మొన్న గౌతమ్ గంభీర్(Gautam Gambhir), శ్రీశాంత్(Sreesanth)లిద్దరూ గల్లాలు పట్టుకునేంత వరకు వెళ్లారు కదా! బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants VS India Capitals)జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ టీమిండియాకు ఆడారు. ఇద్దరూ కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో భాగస్వాములు.
మొన్న గౌతమ్ గంభీర్(Gautam Gambhir), శ్రీశాంత్(Sreesanth)లిద్దరూ గల్లాలు పట్టుకునేంత వరకు వెళ్లారు కదా! బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants VS India Capitals)జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ టీమిండియాకు ఆడారు. ఇద్దరూ కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో భాగస్వాములు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సీనియర్లుగా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నారు. ఇద్దరూ షార్ట్ టెంపర్ ఉన్నవారే. వెటరన్ టోర్నీలో కూడా వీరిద్దరు ఆవేశకావేశాలను అదుపులో పెట్టుకోలేకపోయారు. గొడవపడ్డారు. గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అంటూ దూషించడాన్నది శ్రీశాంత్ ఆరోపణ. ' నా తప్పు ఏమీ లేకపోయినా గంభీర్ నన్ను అనరాని మాటలు అన్నాడు. అది మంచి పద్దతి కాదు' అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ‘ఫిక్సర్, ఫిక్సర్, నువ్వు ఫిక్సర్‌వి అంటూ పదే పదే గంభీర్ అన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా అతను మాత్రం తిట్లను కంటిన్యూ చేస్తూ నన్ను రెచ్చగొట్టాడు. అప్పటికీ నేను ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. అసలు గంభీర్‌కు ఎందుకు కోపం వచ్చిందో, ఎందుకు అలా అన్నాడో నాకు అసలు అర్థం కాలేదు' అని శ్రీశాంత్ తెలిపారు. 'నువ్వు అందరితో ఇలాగే ప్రవర్తిస్తావు. నీకు సీనియర్లు అంటే గౌరవం లేదు. నన్ను అలా అనే హక్కు నీకు లేదు. నువ్వు సుప్రీంకోర్టు కంటే ఎక్కువేం కాదు' అని గంభీర్‌ను ఉద్దేశించి శ్రీశాంత్ అన్నాడు.
ఈ ఘటనపై గంభీర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు టోర్నమెంట్ నిర్వాహకులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఎల్‌ఎల్‌సీలో తగిన నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తున్నామని, ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.