క్రికెట్(Cricket) ఆటలో ఉన్న 11 రకాల అవుట్‌లలో టైమ్డ్ అవుట్(Timed Out) ఒకటి. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి అవుట్ నమోదు కాలేదు కాబట్టి, చాలా మందికి ఇలాంటి అవుట్ ఒకటుంటుందని తెలియదు. ఓ బ్యాట్స్‌మన్ అవుటై పెవిలియన్‌కు వెళ్లిపోయిన తర్వాత కొత్త బ్యాట్స్‌మన్ రెండు నిమిషాల్లో క్రీజ్‌లోకి(Crease) రావాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం ఆలస్యమైనా అతడిని అవుట్‌గా ప్రకటించవచ్చు.
క్రికెట్(Cricket) ఆటలో ఉన్న 11 రకాల అవుట్‌లలో టైమ్డ్ అవుట్(Timed Out) ఒకటి. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి అవుట్ నమోదు కాలేదు కాబట్టి, చాలా మందికి ఇలాంటి అవుట్ ఒకటుంటుందని తెలియదు. ఓ బ్యాట్స్‌మన్ అవుటై పెవిలియన్‌కు వెళ్లిపోయిన తర్వాత కొత్త బ్యాట్స్‌మన్ రెండు నిమిషాల్లో క్రీజ్‌లోకి(Crease) రావాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం ఆలస్యమైనా అతడిని అవుట్‌గా ప్రకటించవచ్చు. 1919లో ససెక్స్ క్రికెటర్ హరాల్డ్ హేగేట్(Harold Heygate) ఇలాగే టైమ్డ్ అవుటయ్యాడు. టౌంటన్లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హేగేట్ రెండు నిమిషాల్లోపు క్రీజ్‌లో రాలేకపోయాడు. ఫలితంగా అంపైర్ ఇతడిని అవుట్‌గా ప్రకటించాడు కానీ విజ్డెన్ క్రికెట్ పుస్తకంలో మాత్రం ఆ అవుట్ అబ్సెంట్‌హర్ట్‌గా నమోదయయ్యింది.
2006-07లో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లింది. మూడో టెస్ట్ మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు వెంట వెంటనే అవుటయ్యారు. ఓపెనర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరుకున్నారు. నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్(Sachin tendulker) క్రీజ్‌లోకి రావాలి. కానీ దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ సమయంలో సచిన్ 18 నిమిషాల పాటు గ్రౌండ్‌లో లేడు. నిబంధనల ప్రకారం ఇండియా ఇన్నింగ్స్ 18 నిమిషాలు పూర్తయ్యాకే అతడు బ్యాటింగ్‌కు దిగాలి.. అప్పటికీ గంగూలీ(Ganguly) సిద్ధంగా లేడు. ప్యాడ్స్ కూడా వేసుకోలేదు. అవన్నీ వేసుకుని క్రీజ్‌లోకి వచ్చేసరికి ఆరు నిమిషాలు అయ్యింది. సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith) ఎలాంటి అప్పీలు చేయలేదు. నిజానికి స్మిత్ గనక టైమ్డ్ అవుట్ అప్పీల్ చేస్తే గంగూలీ అవుటయ్యేవాడు. ఇలాంటి సంఘటనే 2013 యాసెష్ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో జరిగింది. విపరీతమైన జలుబు, దగ్గు కారణంగా ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ లియోన్ ఫీల్డింగ్‌లో ఎక్కువ సమయం ఉండలేకపోయాడు. అందుకే అతడు తన బ్యాటింగ్ స్థానాన్ని నంబర్ 11కు మార్చుకున్నాడు. అప్పుడు కూడా అతడు సమయానికి క్రీజ్‌లోకి రాలేకపోయాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎలాంటి అప్పీలు చేయలేదు. క్రీడా స్ఫూర్తిని పాటించారు. కానీ సోమవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని(Game Sportive) చాటుకోలేకపోయారు..