భారత జట్టు మాజీ కెప్టెన్‌లు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly), విరాట్ కోహ్లీ(Virat Kohli)ల మధ్య వాగ్వాదం ముదురుతోంది. గత వారం చిన్నస్వామి స్టేడియం(Chinnaswami Stadium)లో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

భారత జట్టు మాజీ కెప్టెన్‌లు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly), విరాట్ కోహ్లీ(Virat Kohli)ల మధ్య వాగ్వాదం ముదురుతోంది. గత వారం చిన్నస్వామి స్టేడియం(Chinnaswami Stadium)లో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డగౌట్‌లో కూర్చున్న సౌరవ్ గంగూలీ వైపు విరాట్ కోహ్లీ తదేకంగా చూస్తున్న కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అదేకాక‌.. మ్యాచ్ అనంత‌రం గంగూలీ లైన్‌ను బ్రేక్ చేసి కోహ్లీని పట్టించుకోకుండా.. మరొక ఆటగాడితో కరచాలనం చేశాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌(instagram)లో సౌరవ్ గంగూలీని అన్‌ఫాలో(Unfollow) చేశాడు విరాట్ కోహ్లీ. గంగూలీ కూడా కోహ్లీతో ఢీ అంటే ఢీ అంటున్నాడు. టిట్ ఫర్ టాట్ అన్న‌ట్లుగా కోహ్లీని కూడా గంగూలీ అన్‌ఫాలో చేశాడు. త‌ద్వారా తనకు, కోహ్లీకి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదని గంగూలీ ధృవీకరించిన‌ట్లైంది.

భారత జట్టు కెప్టెన్సీ(TeamIndia Captain)పై విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య వివాదం మొదలైంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ(Captaincy) నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. వన్డేలు(Oneday Match)), టెస్టుల(Test Match)కు కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్ ఉండాలని సెలక్టర్లు భావించారు. వన్డే కెప్టెన్సీ నుండి కూడా కోహ్లీని తొలగించారు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని సెలెక్టర్లు, తాను వ్యక్తిగతంగా కోహ్లీని కోరినట్లు గంగూలీ చెప్పడంతో విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. కెప్టెన్సీ నుంచి తనను తొలగించే విషయం తనకు తెలియదని కోహ్లీ తర్వాత చెప్పాడు. దక్షిణాఫ్రికా(south Africa)తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-2తో భారత్ కోల్పోయిన తర్వాత కోహ్లీ అన్ని ఫార్మాట్ల(All Formats)లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్ప‌టినుండి గంగూలీ, కోహ్లీల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వాన‌లా మారుతుంది.

Updated On 18 April 2023 2:07 AM GMT
Yagnik

Yagnik

Next Story