☰
✕
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు.
x
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడం చాలా ముఖ్యం. 170, 180 రన్స్ చేస్తే మ్యాచులు గెలవలేం. 350-400 పరుగులు చేయాలి. ఓటమి విషయంలో ఎవరినీ నిందించలేం. అందరూ రన్స్ చేయాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పై క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. సిడ్నీలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌పై 6 వికెట్ల తేడాతో కంగారూలు గెలిచేశారు. దీంతో ఈ సిరీస్ 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.
ehatv
Next Story