మార్చి 19న వైజాగ్‌లో జ‌రిగిన‌ ఇండియా - ఆస్ట్రేలియా వన్డే ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జ‌రిగింద‌నే వార్త క‌ల‌క‌లం రేపుతుంది. హైద్రాబాదీ, టీమిండియా ఫాస్ట్‌ బౌలర్ మ‌హ‌మ్మ‌ద్‌ సిరాజ్‌ను ఏపీకి చెందిన వ్యక్తి సంప్రదించినట్లు తెలుస్తోంది.

మార్చి 19న వైజాగ్‌లో జ‌రిగిన‌ ఇండియా - ఆస్ట్రేలియా వన్డే ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జ‌రిగింద‌నే వార్త క‌ల‌క‌లం రేపుతుంది. హైద్రాబాదీ, టీమిండియా ఫాస్ట్‌ బౌలర్ మ‌హ‌మ్మ‌ద్‌ సిరాజ్‌ను ఏపీకి చెందిన వ్యక్తి సంప్రదించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో చాలా డబ్బు పోగొట్టుకున్నానని.. తనను ఆదుకోవాలని స‌ద‌రు పంటర్ సిరాజ్‌ను వేడుకున్నాడు. ఈ మేర‌కు సిరాజ్‌ వాట్సాప్‌కు పంటర్ మెసేజ్‌లు పంపాడు. అయితే సిరాజ్ పంట‌ర్ అభ్య‌ర్ధ‌న ప‌ట్ల స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాక విషయాన్ని వెంట‌నే సిరాజ్‌ బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో బీసీసీఐ సిరాజ్‌కు మెసేజులు పంపిన పంటర్‌ను పట్టుకుంది. పంటర్ ను హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. అయితే.. ఆ పంటర్‌కు ఏ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంటర్‌ ఏపీ పోలీసుల అదుపులో ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా.. మార్చి 19న వైజాగ్‌లో ఇండియా - ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌గా.. ప‌ర్య‌ట‌క ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ 26 ఓవ‌ర్ల‌కు 117 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 11 ఓవ‌ర్ల‌కే వికెట్ కోల్పోకుండా 121 ప‌రుగులు చేసి ల‌క్ష్యాన్ని సాధించింది.

Updated On 19 April 2023 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story