ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ వంద సెంచరీలేం ఖర్మ ..110 సెంచరీలు చేయడం ఖాయం.. ఈ మాటన్నది పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీకి సెంచరీలు చేయడం ఈజీ అని అక్తర్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడిన సంగతి తెలిసిందే.

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ వంద సెంచరీలేం ఖర్మ ..110 సెంచరీలు చేయడం ఖాయం.. ఈ మాటన్నది పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీకి సెంచరీలు చేయడం ఈజీ అని అక్తర్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. టెస్టుల్లో 1205 రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ సాధించడం విశేషం. సుమారు మూడేళ్ల తర్వాత కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ ఆడాడన్నమాట! 27వ సెంచరీకి, 28వ టెస్ట్‌ సెంచరీకి మధ్య కోహ్లీ 41 ఇన్నింగ్స్‌ ఆడాల్సి వచ్చింది. ఈ సెంచరీతో కోహ్లీ తన ఖాతాలో 75వ ఇంటర్నేషనల్‌ సెంచరీని వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్‌ తెందూల్కర్‌ తర్వాత కోహ్లీనే ఉన్నాడు.

కెప్టెన్స బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, ఇక సెంచరీల మీద సెంచరీలు చేస్తాడని షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. ఆయన తప్పకుండా వంద సెంచరీల మార్క్‌ను దాటేస్తాడని షోయబ్‌ పేర్కొన్నాడు. అతడిపై ఉన్న కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే ఫామ్‌ను కోల్పోయాడని, ఆయన కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని తాను ఎప్పుడో ఊహించానని అక్తర్‌ వివరించాడు.
ఇప్పుడు అత‌ను మెంట‌ల్‌గా ఫ్రీగా ఉన్నాడ‌ని అక్త‌ర్ తెలిపాడు. ఇప్పుడు అత‌ను ఎంతో ఫోక‌స్‌తో ఇన్నింగ్స్ ఆడుతాడ‌ని, కోహ్లీ మొత్తం 110 సెంచ‌రీలు కొట్ట‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని అక్త‌ర్ అన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక కోహ్లీ మానసికంగా ఫ్రీ అయ్యాడని, ఇప్పుడు కోహ్లీ ఎంతో ఫోకస్‌తో ఇన్నింగ్స్‌ ఆడతాడని చెబుతూ ఈజీగా 110 సెంచరీలు సాధిస్తాడని అక్తర్‌ అన్నాడు.

రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్‌(Rawalpindi Express)గా అందరూ పిలుచుకునే షోయబ్‌ అక్తర్‌కు సచిన్‌ అంటే ఎంతో అభిమానం. సచిన్‌ వికెట్‌ తీయడంలో ఉన్న మజానే వేరన్నాడు. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో తాను సచిన్‌ వికెట్‌ను తీస్తానని టీమ్‌ మేట్స్‌తో చెప్పానని, చెప్పినట్టుగానే ఫస్ట్‌ బాల్‌కే సచిన్‌ వికెట్‌ తీశానని షోయబ్‌ అన్నాడు. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల మధ్య సచిన్‌ వికెట్‌ తీయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, సచిన్‌ వెనుదిరగడంతోనే స్టేడియంలోని సగం మంది ప్రేక్షకులు ఇంటికి వెళ్లిపోయారని షోయబ్‌ గుర్తు చేశాడు.

Updated On 17 March 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story