పాకిస్తాన్‌(Pakistan) ఫాస్ట్ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది(Shaheen Afridi) మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన భార్య అన్షానే(Ansha) మరోసరి గ్రాండ్‌గా వివాహం చేసుకోనున్నాడు. ఆసియా కప్‌ -2023(Aisa cup 2023) ఫైనల్‌ ముగిసిన తర్వాత వివాహ వేడుక జరుగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షాహిన్‌ ఆఫ్రిది- అన్షాలు వివాహబంధంతో ఒక్కటయ్యారు.

పాకిస్తాన్‌(Pakistan) ఫాస్ట్ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది(Shaheen Afridi) మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన భార్య అన్షానే(Ansha) మరోసరి గ్రాండ్‌గా వివాహం చేసుకోనున్నాడు. ఆసియా కప్‌ -2023(Aisa cup 2023) ఫైనల్‌ ముగిసిన తర్వాత వివాహ వేడుక జరుగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షాహిన్‌ ఆఫ్రిది- అన్షాలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. అన్షా ఎవరో కాదు, పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది(Shahid Afridi) కూతురు. అప్పుడు కూడా తన కూతురు వివాహాన్ని షాహిద్‌ ఘనంగానే చేశారు. కాకపోతే పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో పాటు రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఈసారి చాలా మంది ఆహ్వానితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కొత్త జంట భావించింది. సెప్టెంబర్‌ 19వ తేదీన షాహిన్‌- అన్షా నిఖా జరగబోతున్నది. కరాచిలో పెళ్లి జరిగిన తర్వాత బరాత్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 21న ఇస్లామాబాద్‌లోని ప్రైవేటు హోటల్‌లో వలిమా నిర్వహిస్తారు. 2000 సంవత్సరంలో ఖైబర్‌ ఏజెన్సీలో జన్మించిన షాహిన్‌ 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అచిర కాలంలోనే పాకిస్తాన్‌ ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు 27 టెస్ట్‌ మ్యాచ్‌లు, 42 వన్డే మ్యాచ్‌లు, 52 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. వర్షం కారణంగా రద్దు అయిన లీగ్‌ మ్యాచ్‌లో షాహిన్‌ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన షాహిన్‌ తర్వాత హార్దిక్‌ పాండ్యా, జడేజా వికెట్లను కూడా తీసుకున్నాడు.

Updated On 9 Sep 2023 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story