భారత స్టార్‌ బౌలర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయపడి. భారత్‌లో విజయవంతమైన ఆటగాళ్లలో షమీ ఒకరు.

భారత స్టార్‌ బౌలర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయపడి. భారత్‌లో విజయవంతమైన ఆటగాళ్లలో షమీ ఒకరు.ఈ ఏడాదిలో ఈ ఆటగాడి పేరు మార్మోగిపోయింది. అలాగే టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని పెంచింది. గత కొన్ని రోజులుగా సానియా మీర్జా, మహమ్మద్ షమీల పేర్లు కలిపి జోరుగా వినిపిస్తున్నాయి. మహ్మద్ షమీ, సానియా మీర్జా దుబాయ్‌లో ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫొటోలు వైరలయ్యాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సానియా మీర్జా , మహ్మద్ షమీ ఫోటోలు పూర్తిగా ఎడిట్ చేసినట్లుగా సమాచారం. కేవలం సెన్షేషన్‌ చేయడానికే ఈ మెసేజ్‌లు, ఫోటోలు షేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహ్మద్ షమీ, సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అదే టైంలో సానియా మీర్జా తండ్రి ఈ వార్తలను ఖండించారు. అయినా సోషల్‌ మీడియాలో వీళ్లిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుని విడాకులు ఇచ్చింది. మరోవైపు షమీ కూడా హసిన్ జహాన్‌తో విడాకులు తీసుకున్నాడు. వీళ్లిద్దరూ వాళ్ల జీవితభాగస్వాములను వదులుకొని సింగిల్‌గా ఉంటున్న క్రమంలోనే ఈ పుకార్లకు ఆజ్యం ఏర్పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story