ముంబాయిలో(Mumbai) ఉన్న వాంఖడే స్టేడియంలో(Wankhede Stadium) సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) విగ్రహాన్ని ఏర్పాటైతే చేశారు కానీ.. ఆ విగ్రహం రూపు రేఖలను ఎవరూ పట్టించుకోలేదు. సచిన్ ఫ్యాన్స్ కూడా దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకు కారణం సచిన్ విగ్రహం(IDOL) సచిన్‌లా లేకపోవడం..
ముంబాయిలో(Mumbai) ఉన్న వాంఖడే స్టేడియంలో(Wankhede Stadium) సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) విగ్రహాన్ని ఏర్పాటైతే చేశారు కానీ.. ఆ విగ్రహం రూపు రేఖలను ఎవరూ పట్టించుకోలేదు. సచిన్ ఫ్యాన్స్ కూడా దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకు కారణం సచిన్ విగ్రహం(IDOL) సచిన్‌లా లేకపోవడం.. పైగా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను(Steve smith) పోలి ఉండటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందించలేదని విగ్రహ రూపకర్తపై మండిపడుతున్నారు. ఇండియాతో పాటు క్రికెట్ ఆడే దేశాలలో సచిన్ ఖ్యాతి గడించాడు. అలాంటి సచిన్ విగ్రహాన్ని తయారుచేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విగ్రహ రూపకర్త మాత్రం ఇలాంటివి పెద్దగా పట్టించుకోనట్లే ఉంది. ఈ విగ్రహంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 1వ తేదీన క్రికెట్ దిగ్గజం సచిన్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. వాంఖడేలో సచిన్ స్టాండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఆఫ్‌సైడ్ షాట్ ఆడే పోజ్‌లో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహావిష్కరణకు సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా హాజరయ్యారు.సచిన్ తన సొంత మైదానమైన వాంఖడేలో 2013, నవంబర్ 16వ తేదీన తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.