రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అతడి మీద భారీ ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ ఆశలను ఇప్పటికే వమ్ము చేసిన మ్యాక్స్ వెల్.. టోర్నమెంట్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిజికల్ అండ్ మెంటల్ బ్రేక్ కావాలని నిర్ణయం తీసుకున్నాడు.

సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ లో మాక్స్‌వెల్ ఆడలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ వేలికి గాయమైంది. దీంతో సన్ రైజర్స్ మ్యాచ్ కు దూరమయ్యాడు.. ఇప్పుడు ఏకంగా లీగ్ నుండి విరామం తీసుకున్నట్లు ప్రకటించాడు. చివరి గేమ్ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్, కోచ్‌ల వద్దకు వెళ్లాను.. నా స్థానంలో మరొకరిని ప్రయత్నించే సమయం వచ్చిందని చెప్పానన్నాడు. నేను టోర్నమెంట్‌లో పాల్గొనవలసి వస్తే.. నేను మంచి మానసిక, శారీరక పరిస్థితిలో తిరిగి వస్తాను.. అప్పుడు నేను ప్రభావం చూపగలను.. అని మ్యాక్సీ వ్యాఖ్యలు చేశాడు. మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో 5.33 సగటుతో మరియు 94 స్ట్రైక్-రేట్‌తో కేవలం 32 పరుగులు చేశాడు.

Updated On 16 April 2024 12:54 AM GMT
Yagnik

Yagnik

Next Story