రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు.. ప్రతీసారి ఇదే జరుగుతోంది. ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి ఇదే తంతు. ప్రతీసారి టైటిల్‌ గెల్చుకుంటుందనే అనిపిస్తుంది. మూడుసార్లు ఫైనల్స్‌కు వచ్చిన ఆర్‌సీబీ టైటిల్‌(RCB Title)ను మాత్రం గెల్చుకోలేకపోయింది. ప్రతి సీజన్‌లో ఓ చెత్త మ్యాచ్‌ ఆడటం రివాజుగా మారింది. నిన్న ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 81 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు.. ప్రతీసారి ఇదే జరుగుతోంది. ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి ఇదే తంతు. ప్రతీసారి టైటిల్‌ గెల్చుకుంటుందనే అనిపిస్తుంది. మూడుసార్లు ఫైనల్స్‌కు వచ్చిన ఆర్‌సీబీ టైటిల్‌(RCB Title)ను మాత్రం గెల్చుకోలేకపోయింది. ప్రతి సీజన్‌లో ఓ చెత్త మ్యాచ్‌ ఆడటం రివాజుగా మారింది. నిన్న ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 81 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆర్‌సీబీ 123 పరుగులకే ఆలౌటయ్యింది. ఒక దశలో 95 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఆకాశ్‌ దీప్‌(Akash Deep), డేవిడ్‌ విల్లేలు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ఈ మాత్రం పరుగులనైనా సాధించగలిగింది. లేకపోతే వందపరుగులలోపే చాపచుట్టేసేది. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికసార్లు 125 పరుగుల లోపే ఆలౌటైన జట్టుగా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇలాంటి చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)కు కూడా ఉంది. ఈ రెండు జట్టు ఇప్పటి వరకు చెరో 15 సార్లు 125 పరుగుల లోపు ఆలౌటయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో రాజస్తాన్‌ రాయల్స్‌(Rajasthan Royals) ఉంది. ఈ టీమ్‌ 11 సార్లు 125 పరుగులలోపు ఆలౌట్‌ అయ్యింది. కోలకతా నైట్‌ రైడర్స్‌(Kolkata Knight Riders), ముంబాయ్‌ ఇండియన్స్‌(Mumbai Indians) జట్లు తొమ్మిదేసి సార్లు ఇలా ఆలౌటయ్యాయి. పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) ఎనిమిదిసార్లు 125 పరుగుల లోపు ఆలౌటయ్యింది. చిత్రమేమిటంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబాయి ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఆడింది ఆర్‌సీబీ. ఇందులో మాత్రం దూకుడుగా ఆడింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేస్తే, డుప్లెసిస్‌ 73 పరుగులు చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు విఫలమయ్యారు.

Updated On 6 April 2023 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story