ఐపీఎల్-2023లో ఆదివారం(Sunday) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తలపడనున్నాయి. సీజన్ లో 22వ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది. రోహిత్ శర్మ(Rohit Sharma), నితీష్ రాణా(nitish Rana) ల సారథ్యంలో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.

Rohit Sharma’s MI are all set to host Nitish Rana’s KKR at the Wankhede Stadium
ఐపీఎల్-2023లో ఆదివారం(Sunday) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తలపడనున్నాయి. సీజన్ లో 22వ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది. రోహిత్ శర్మ(Rohit Sharma), నితీష్ రాణా(nitish Rana) ల సారథ్యంలో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మళ్లీ ఫామ్‌లోకి రావడం ముంబై ఇండియన్స్‌కు సంతోషకరమైన విషయం. సూర్యకుమార్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా గత మ్యాచ్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందాడు. రింకూ సింగ్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. రస్సెల్ ఫామ్ కేకేఆర్‌కు ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో సునీల్ నారాయణ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో టిమ్ సౌథీ ఆడలేదు. ఈ నేఫథ్యంలో ఇరుజట్లలో ఒకరిద్దరు మినహా పెద్దగా మార్పులుండవు. ప్లేయింగ్ లెవెన్ ఆటగాళ్లు జాబితాను ఒకసారి చూద్దాం.
ప్లేయింగ్ ఎలెవెన్ :
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, రితిక్ షోకీన్, నెహాల్ వధేరా, అర్షద్ ఖాన్, రిలే మెరెడిత్
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్ జగదీసన్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్
