2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Champiaon) ఫైనల్‌లో ఓటమి తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. టెస్టు కెప్టెన్సీ(Captaincy) నుంచి రోహిత్ శర్మను తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి భారత టెస్టు జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతాడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పష్టం చేశాడు.

2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Champiaon) ఫైనల్‌లో ఓటమి తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. టెస్టు కెప్టెన్సీ(Captaincy) నుంచి రోహిత్ శర్మను తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి భారత టెస్టు జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతాడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పష్టం చేశాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు అద్భుతమైనది. విజయాల‌శాతం పరంగా రోహిత్‌ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్.

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణంగా అతని కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్‌లు ఆడేందుకు ఫిట్‌గా లేడని చాలా మంది భావిస్తున్నారు. 36 ఏళ్ల రోహిత్ తదుపరి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు మూడు ఫార్మాట్లలో ఆడగలడా లేదా అనేది స్వయంగా నిర్ణయించుకోవాలి. రోహిత్‌ మూడు ఫార్మాట్లలో ఆడాలంటే.. అతను బ్యాట్‌తో నిలకడగా రాణించాలి. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు జట్టు కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకుంటే.. భారత కొత్త కెప్టెన్ ఎంపిక అంత సులువు కాదు.

టీమ్ ఇండియాలో(Team India) ఎక్కువ మంది ఆటగాళ్లు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం లేదు. చతేశ్వర్ పుజారాకు కెప్టెన్సీ అనుభవం లేదు. పుజారా పేలవమైన ఫామ్ కారణంగా.. టీమ్ ఇండియాకు దూర‌మ‌య్యే అవ‌కాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజింక్యా రహానే(Ajinkya Rahane) భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. 35 ఏళ్ల రహానే కూడా ఎక్కువ కాలం భారత్‌కు కెప్టెన్సీ చేయలేడు. అయితే ర‌హానే కెప్టెన్సీలో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే అవ‌కాశం లేక‌పోలేదు.

రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలకు సిద్ధంగా ఉంటే.. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), రిషబ్ పంత్(Rishab Panth), శ్రేయాస్ అయ్యర్(Shreyas iyer), శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లను భవిష్యత్ కెప్టెన్‌లుగా సిద్ధం చేసి.. తదుపరి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వ‌ర‌కూ ఉత్తమ కెప్టెన్ ను ఎంపిక చేసుకోవ‌చ్చు. బుమ్రాతో పాటు పంత్, అయ్యర్‌లకు నాయకత్వం వహించే సత్తా ఉందని చూపించారు. అయితే ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం గాయాలతో పోరాడుతున్నారు. బుమ్రా గాయం కారణంగా ఎక్కువ కాలం టెస్టు క్రికెట్ ఆడడం అతనికి కష్టమే. ఇక పంత్ ఎప్పుడు మైదానంలోకి వస్తాడనే దానిపై స్పష్టత లేదు. అయ్యర్ గాయం నుండి త్వరలో తిరిగి వస్తున్నాడు. అయితే.. రహానే తిరిగి జ‌ట్టులోకి రావ‌డంతో అయ్యర్ స్థానం ప్ర‌శ్నార్ధ‌క‌మైంది. ఇటువంటి పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్‌ శుభ్‌మన్ గిల్‌పై ఆశ‌లు పెట్టుకోవాల్సిందే.

ప్ర‌స్తుతం రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. రహానే ఆ బాధ్యత తీసుకోకపోతే.. అశ్విన్‌ను టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా చేయొచ్చు. యువకుడైన‌ శుభ్‌మన్ గిల్ అనుభ‌వం సాధించి కెప్టెన్సీ పొందిన‌ట్లైతే ఎక్కువ కాలం బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గ‌ల‌డు. ఒక‌వేళ‌ లోకేష్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లను కెప్టెన్‌గా చేసినా.. రాబోయే రెండు-మూడేళ్ల తర్వాత మళ్లీ కొత్త కెప్టెన్‌ను వెత‌కాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

Updated On 14 Jun 2023 11:55 PM GMT
Ehatv

Ehatv

Next Story