ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) సంప్రదాయ క్రికెట్‌ను(Cricket) నాశనం చేసిందన్న వాదనలో నిజమున్నప్పటికీ ఈ టోర్నమెంట్‌ వర్ధమాన క్రికెటర్లకు మాత్రం వరంగా మారింది. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రికెటర్లు జీవితంలో స్థిరపడ్డారు. ఐపీఎల్‌ -2014 వేలంలో కూడా చాలా మంది యంగ్‌ ఇండియన్‌ క్రికెటర్లు లబ్ధి పొందారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆన్‌క్యాస్డ్‌ ప్లేయర్లు కోట్లు సంపాదించారు.

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవలసింది జార్ఖండ్‌ యువ సంచలనం రాబిన్‌ మింజ్‌(Robin Minj) గురించి. గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) ఇతడిని 3.6 కోట్ల రూపాయల భారీ ధరకు కొనేసుకుంది. 20 లక్షల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకోవడానికి ముంబాయ్‌ ఇండియన్స్‌(Mumbai Indians), చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings), గుజరాత్‌ టైటాన్స్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు 3.6 కోట్ల రూపాయలు పెట్టి గుజరాత్‌ టైటాన్స్‌ ఇతడిని దక్కించుకుంది.

ఐపీఎల్‌ వేలం చరిత్రలో అమ్ముడుపోయిన మొట్టమొదటి గిరిజన క్రికెటర్‌గా(Tribe Cricketer) 21 ఏళ్ల రాబిన్‌ మింజ్‌ చరిత్ర సృష్టించాడు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో రాబిన్‌ మింజ్‌ జన్మించాడు. తండ్రి ఇండియన్‌ ఆర్మీలో(indian Army) పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌ ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. బాల్యంలోనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు రాబిన్‌ మింజ్‌. క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో చదవుపై పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయాడు. అతి కష్టం మీద పదో తరగతి వరకు చదివాడు.

ఆ తర్వాత క్లబ్‌ క్రికెట్‌, అండర్‌-19, అండర్‌-25 టోర్నమెంట్లలో జార్ఖండ్‌ తరఫున ఆడాడు. అద్భుతంగా రాణించాడు. క్లబ్‌ క్రికెట్‌లో అయితే మింజ్‌కు ఏకంగా 140 స్ట్రైక్‌ రేట్‌ ఉంది. ఈ ఏడాది బ్రిటన్‌ వేదికగా ముంబాయి ఇండియన్స్‌ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌కు ఎంపిక అయ్యాడు రాబిన్‌ మింజ్‌. ఒడిశాలో జరిగిన ఓ టీ 20 టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌లో రాబిన్‌ మింజ్‌ కేవలం 35 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాబిన్‌ మింజ్‌కు మహేంద్రసింగ్ ధోనీనే(MS Dhoni) ఆదర్శం. ధోని అంతటి పేరు తెచ్చుకోవాలన్నది మింజ్‌ ఆకాంక్ష!

Updated On 20 Dec 2023 4:02 AM GMT
Ehatv

Ehatv

Next Story