ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మే 7న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మే 7న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ ను, 30 లక్షల జరిమానాను ఎదుర్కోవలసి వచ్చింది. మ్యాచ్ లో ఆఖరి ఓవర్ ప్రారంభంలో DC నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు వెనుకబడి ఉంది. సస్పెన్షన్, భారీ జరిమానా ఎదుర్కోవడం ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు మూడవది.మిగిలిన DC ప్లేయర్‌లకు - ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా జరిమానా విధించబడింది. మ్యాచ్ రిఫరీ ఈ తీర్పును సవాలు చేస్తూ DC అప్పీల్‌ను దాఖలు చేసింది. దీనిని సమీక్ష కోసం BCCI అంబుడ్స్‌మన్‌కు పంపారు. అంబుడ్స్‌మన్ వర్చువల్ హియరింగ్ నిర్వహించి, మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైనది, కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
పంత్ ఆదివారం (మే 12) సాయంత్రం బెంగుళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. DC ఆశలు ప్లేఆఫ్‌స్ రేసులో సజీవంగా ఉన్న సమయంలో పంత్ మ్యాచ్ కు దూరమవ్వడం నిజంగా షాకింగ్ విషయమే!!