అందరూ ఆడుతున్నారు.. మరి నేనెందుకు ఆడకూడదు. నేనింకా గేమ్‌లోనే ఉన్నా.. ఐపీఎల్(ipl) ఆడేందుకు వస్తున్నా...
రిషబ్ పంత్(rishabh pant)ఓ వీడియోలో చెప్పిన ఈ మాటలు విని అందరూ సంబరపడ్డారు. పంత్ రాకకోసం ఎదురుచూస్తున్న అభిమానులైతే ఎగిరి గంతేశారు. కానీ తర్వాత అదో ప్రమోషనల్ వీడియో అని తెలుసుకుని నీరుగారిపోయారు. ఐపీఎల్‌లో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ ఉంటే ఐపీఎల్‌కు ఓ జోష్ ఉండేది. ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) కూడా ఇలాగే అనుకుంది.
అందరూ ఆడుతున్నారు.. మరి నేనెందుకు ఆడకూడదు. నేనింకా గేమ్‌లోనే ఉన్నా.. ఐపీఎల్(ipl) ఆడేందుకు వస్తున్నా...
రిషబ్ పంత్(rishabh pant)ఓ వీడియోలో చెప్పిన ఈ మాటలు విని అందరూ సంబరపడ్డారు. పంత్ రాకకోసం ఎదురుచూస్తున్న అభిమానులైతే ఎగిరి గంతేశారు. కానీ తర్వాత అదో ప్రమోషనల్ వీడియో అని తెలుసుకుని నీరుగారిపోయారు. ఐపీఎల్‌లో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ ఉంటే ఐపీఎల్‌కు ఓ జోష్ ఉండేది. ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) కూడా ఇలాగే అనుకుంది. అతడితో ఓ ప్రమోషనల్ వీడియో చేయిస్తే బాగుంటుందని భావించింది. వెంటనే పంత్‌తో ఓ వీడియో చేసి ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ ప్రమోషన్ వీడియోలో పంత్ చాలా మాట్లాడాడు. క్రికెట్, ఫుడ్... ఈ రెండూ నా జీవితంలో భాగం. వీటిని వదిలిపెట్టి నేను బతకలేను. రోడ్డు ప్రమాదం(road accident)కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాను. అలాగే ఇష్టమైన ఫుడ్‌ను తినలేకపోయాను. కొంచెం కోలుకున్న తర్వాత మంచిగా తింటే తొందరగా రికవరీ (recovery)అవుతావని డాక్టర్లు చెప్పారు. అందుకే ఇప్పుడు హోమ్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నాను. క్రికెట్ సీజన్ మొదలవుతోంది.. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. క్రికెట్ ఎందుకు ఆడకూడదనని అనిపించింది. అందరూ ఆడుతున్నారు. నేను ఎందుకు ఆడకూడదు. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నా.. మ్యాచ్‌లు ఆడేందుకు వస్తున్నా .. అంటూ పంత్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. వైరల్ (viral)అవుతున్న ఈ వీడియో చూసి ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ ఆడేందుకు నువ్వు వస్తున్నావని తెలిసి సంతోషపడిపోయాం. ఇంత మోసం చేస్తావా పంత్? తొందరగా కోలుకో .. అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.
లాస్టియర్ డిసెంబర్‌లో రిషబ్ పంత్‌కు రోడ్డ్ యాక్సిడెంట్ అయ్యింది. ఢిల్లీ నుంచి లక్నోకు వస్తున్నప్పుడు రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్‌కు చాలా సర్జరీలు అయ్యాయి. ఇప్పుడిప్పుడే పంత్ కోలుకుంటున్నాడు. తొమ్మిది నెలలుగా పంత్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే చాలా స్పీడ్‌గా రికవరీ అవుతున్నాడు. అంటే అనుకున్నదాని కంటే ముందుగానే పంత్ క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టవచ్చు. వన్డే వరల్డ్‌కప్(oneday worldcup)కు కూడా పంత్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్‌కు పంత్ దూరమవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్(davidwarner) కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌ను జట్టులో తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలబడుతుంది..