ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian Premier League) వచ్చిన తర్వాత సంప్రదాయ క్రికెట్‌కు నష్టం కలిగిందో లేదో చెప్పడం కష్టం కానీ, చాలా మంది క్రికెటర్ల ఆర్ధిక స్థితిని మార్చేసింది అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. ఇంకా దేశవాళి క్రికెట్‌లో పాదం మోపని క్రికెటర్లను కూడా ఓవర్‌నైట్‌ స్టార్లుగా మార్చేసింది ఐపీఎల్‌. ఇప్పుడు రింకూ సింగ్(rinku singh) అనే ఆటగాడు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి స్టార్‌గా ఎదిగాడు. జస్ట్ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు( Kolkata Knight Riders) ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూసింగ్‌ మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian Premier League) వచ్చిన తర్వాత సంప్రదాయ క్రికెట్‌కు నష్టం కలిగిందో లేదో చెప్పడం కష్టం కానీ, చాలా మంది క్రికెటర్ల ఆర్ధిక స్థితిని మార్చేసింది అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. ఇంకా దేశవాళి క్రికెట్‌లో పాదం మోపని క్రికెటర్లను కూడా ఓవర్‌నైట్‌ స్టార్లుగా మార్చేసింది ఐపీఎల్‌. ఇప్పుడు రింకూ సింగ్(rinku singh) అనే ఆటగాడు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి స్టార్‌గా ఎదిగాడు. జస్ట్ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు( Kolkata Knight Riders) ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూసింగ్‌ మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ గుజరాత్‌ టైటాన్స్‌తో (gujarat taitans) జరిగిన మ్యాచ్‌ తర్వాత రింకూసింగ్‌ పేరు మారిమోగిపోతోంది. ఐపీఎల్‌లో గొప్ప మ్యాచ్‌లను ఏరితే అందులో రింకూసింగ్‌ సాధించిన అద్భుత ఇన్నింగ్స్ కూడా ఉండే తీరుతుంది. అంత గొప్పగా ఆడాడు. కోలకతా నైట్‌ రైడర్స్‌ విజయానికి చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు చేయాలి. ఇది అసాధ్యమేమీ కాదు కానీ చాలా సంక్లిష్టం. ఏదో మిరాకిల్‌ జరిగితే తప్ప సాధ్యం కాదు. ఆ అద్భుతాన్ని రింకూసింగ్‌ సాధించాడు. వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. మొత్తంగా 21 బాల్స్‌లో రింకూ సింగ్‌ ఒక్క ఫోర్‌, 6 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు.

రింకూసింగ్‌ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక అంతులేని బాధ ఉంది. కష్టం ఉంది. తన కుటుంబాన్ని పోషించడం కోసం స్వీపర్‌గా, ఆటో డ్రైవర్‌గా పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. పాతికేళ్ల రింకూసింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌(Aligarh)లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. కొన్ని సమయాల్లో కడుపు నిండా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. రింకూ తండ్రి అలీఘర్‌లో డోర్‌ టు డోర్‌ గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేస్తుండేవాడు. రింకూసింగ్‌ పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువు ఆపేశాడు. అందుకు కారణం ఆర్థిక పరిస్థితులే. స్వీపర్‌గా పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో రాకముందు అలీఘర్‌లో రెండు గదులు ఉన్న ఓ చిన్న ఇంట్లో ఉండేవాడు. తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఆ రెండు గదుల్లోనే సర్దుకునే వారు. 2018వ సంవత్సరం రింకూసింగ్‌ జీవితాన్ని మార్చేసింది. ఆ ఏడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఇతడిని 80 లక్షల రూపాయలకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేసింది. చిత్రమేమిటంటే ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌ రింకూ సింగ్‌ను వదిలేసింది. వేలంలోకి వచ్చిన రింకూసింగ్‌ను మళ్లీ కోల్‌కతా నైట్‌ రైడర్సే సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం అతడిని 55 లక్షల రూపాయలకే కొనుగోలు చేసింది.

Updated On 9 April 2023 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story