రోహిత్‌శర్మ(Rohith Sharma) సారథ్యంలోని టీమిండియా(Team India) వన్డే ప్రపంచకప్‌(One day world cup) ఫైనల్లోకి అడుగుపెట్టింది. కప్‌ గెల్చుకోవడానికి కేవలం అడుగు దూరంలోనే ఉంది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌ను(New Zealand) 70 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో ఓటమి అన్నదే లేకుండా ఇండియా జైత్రయాత్ర సాగిస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్‌ పోరు కోసం సర్వసన్నద్ధమవుతోంది.

రోహిత్‌శర్మ(Rohith Sharma) సారథ్యంలోని టీమిండియా(Team India) వన్డే ప్రపంచకప్‌(One day world cup) ఫైనల్లోకి అడుగుపెట్టింది. కప్‌ గెల్చుకోవడానికి కేవలం అడుగు దూరంలోనే ఉంది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌ను(New Zealand) 70 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో ఓటమి అన్నదే లేకుండా ఇండియా జైత్రయాత్ర సాగిస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్‌ పోరు కోసం సర్వసన్నద్ధమవుతోంది. కప్‌ గెలిస్తే టీమిండియాకు వచ్చే బోల్డన్నీ బెనిఫిట్స్‌ సంగతేమిటో కానీ వైజాగ్‌ వాసులకు మాత్రం ఓ బ్రహ్మండమైన ఆఫర్‌ను వైజాగ్‌ బ్యూటీ రేఖా భోజ్‌(Rekha Bhoj) ఇచ్చారు. తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి సంచలన ప్రకటన చేశారు. ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే వైజాగ్‌ బీచ్‌లో(Vizag Beach) స్ట్రీకింగ్‌ చేస్తానంటూ పోస్ట్‌ పెట్టారు. స్ట్రీకింగ్‌ అంటే ఏమిటంటే పట్టరాని ఆనందంతో బట్టలిప్పి(Nude) పరుగులు తీయడం. ఇంతకు ముందు ఫుట్‌బాల్‌ కప్‌ గెలిచినప్పుడు కొన్ని దేశాల అభిమానులు ఇలాగే చేశారు. (ప్రతిమా బేడి (కొందరు ప్రొతిమా బేడి అని కూడా అంటారు) గుర్తుండే ఉంటుంది. ప్రముఖ ఒడిస్సీ కళాకారిణి, మోడల్‌ అయిన ప్రొతిమా 1974లో జుహూ బీచ్‌లో ఇలాగే స్ట్రీకింగ్‌ చేశారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఒంటిపై నూలుపోగైనా లేకుండా పరుగు పెట్టడమనే సంస్కృతి ఎక్కువగా పాశ్చాత్య దేశాలలోనే ఉంటుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంతో వారు స్ట్రీకింగ్‌ చేస్తుంటారు. ఇప్పుడు రేఖా భోజ్‌ కూడా అలాంటి పని చేయనుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందన్నది రేఖా భోజ్‌ భావన. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తే...వైజాక్‌ బీచ్‌లో బట్టలు లేకుండా పరుగెడుతానని ఆమె స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఆమె చేసిన ప్రకటనపై కొందరు నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇండియా గెలిస్తే సంబరపడాలి కానీ బట్టలిప్పేసి పరుగులు పెడతావా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని హితవు చెబుతున్నారు. ఇలాంటి కామెంట్లకు కూడా రేఖా భోజ్‌ సమాధానం ఇచ్చింది. 'లేదండి..మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్‌పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు' అని రిప్లై ఇచ్చారు. కానీ కొందరు మాత్రం వైజాగ్‌కు రెడీ అవుతున్నారు. మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా తదితర సినిమాల్లో రేఖా భోజ్‌ నటించారు. ఇన్ని సినిమాలు చేసినా ఆమెకు పేరు రాలేదు. అవకాశాలు రాలేదు. అందుకే వైజాగ్‌లో సొంతంగా ఓ స్టూడియో పెట్టుకుని కవర్స్‌ సాంగ్స్‌ చేస్తున్నారు. అలా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నారు. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైన కూడా ఆమె గతంలో వైరల్‌ కామెంట్స్‌ చేశారు. విశాఖపట్నంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. చదువుతున్నప్పుడే షార్ట్‌ ఫిల్మ్స్‌లలో నటించారు. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లారు. అందరూ అందంగా అచ్చం నయనతారలా ఉన్నావు అని చెప్పారే కానీ ఛాన్సులు మాత్రం ఇవ్వలేదు. యువ దర్శకుడు రాకేశ్‌ రెడ్డి ఆమెకు మొదటిసారిగా అవకాశం ఇచ్చారు. కాలాయ తస్మై నమః సినిమాలో ఆమె మూగ పాత్రను పోషించారు.

Updated On 16 Nov 2023 5:21 AM GMT
Ehatv

Ehatv

Next Story