✕
ఈనెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్(Test Series) ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డులు సృష్టించనున్నాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) అధిరోహించే మెట్లు ఇవే..!

x
Virat Kohli
-
- ఈనెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్(Test Series) ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డులు సృష్టించనున్నాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) అధిరోహించే మెట్లు ఇవే..!
-
- టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లీకి ఇంకా 152 రన్స్ అవసరం. మరో 152 పరుగులు చేస్తే భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్(Sachin), సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్‌ల సరసన నిలుస్తాడు. ఈ ముగ్గురు ప్లేయర్లు భారత్ తరఫున 9 వేల పరుగులు పూర్తి చేశారు.
-
- టెస్ట్ క్రికెట్లో వెయ్యి బౌండరీలు(Boundaries) చేసేందుకు కోహ్లీకి మరో 9 బౌండరీలే కావాలి. మరో 9 బౌండరీలు పూర్తి చేస్తే ఇప్పటికే ఈ ఫీట్ సాధించిన సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గవాస్కర్ పక్కనే చేరనున్నాడు ఈ స్టార్ ప్లేయర్.
-
- కోహ్లీ మరో రికార్డ్ ఏంటంటే.. ఇంగ్లాండ్‌పై 2 వేల టెస్టు పరుగులు సాధించడానికి కేవలం ఈ సిరీస్ లో మరో 9 పరుగులు చాలు. దీంతో కోహ్లీ ఇంగ్లాండ్‌పై(England) 2 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించడంతో పాటు సునీల్ గవాస్కర్, సచిన్‌ల సరసన నిలుస్తాడు
-
- అంతేకాదు ఇంగ్లాండ్‌పై మరో 52 పరుగులు చేస్తే ఈ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఆస్ట్రేలియాపై 25 టెస్టులు ఆడిన కోహ్లీ 2042 పరుగులు చేశాడు.
-
- ఇక మరో రికార్డ్ కూడా కోహ్లీ సొంతం కానుంది. ఇంగ్లాండ్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. ఐదు టెస్టు సిరీస్‌లలో మరో మూడు సెంచరీలు చేస్తే ఇప్పటికే ఈ ఫీట్ సాధించిన సచిన్, గవాస్కర్‌తో సమానంగా నిలవనున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌పై కోహ్లీ ఐదు సెంచరీలు చేశాడు.

Ehatv
Next Story