ఐపీఎల్‌-2023లో(IPL 2023) చాలా జట్లు ఆట‌గాళ్ల‌ గాయాల‌ సమస్యతో ఇబ్బందులు ప‌డుతున్నాయి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. రజత్ పాటిదార్(Rajath patidar), జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) వంటి ఆటగాళ్లు లేకుండానే ఈ జట్టు బ‌రిలోకి దిగుతుంది. కేకేఆర్‌తో(KKR) జరిగిన మొదటి మ్యాచ్‌లో రీస్ టోప్లీ(Reece Topley) కూడా భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. రజత్ పాటిదార్(Rajath patidar) ఇప్పటికే మొత్తం సీజన్‌కు దూరం కాగా

ఐపీఎల్‌-2023లో(IPL 2023) చాలా జట్లు ఆట‌గాళ్ల‌ గాయాల‌ సమస్యతో ఇబ్బందులు ప‌డుతున్నాయి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. రజత్ పాటిదార్(Rajath patidar), జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) వంటి ఆటగాళ్లు లేకుండానే ఈ జట్టు బ‌రిలోకి దిగుతుంది. కేకేఆర్‌తో(KKR) జరిగిన మొదటి మ్యాచ్‌లో రీస్ టోప్లీ(Reece Topley) కూడా భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. రజత్ పాటిదార్(Rajath patidar) ఇప్పటికే మొత్తం సీజన్‌కు దూరం కాగా.. రీస్ టోప్లీ(Reece Topley) రెండు వారాల పాటు జట్టుకు దూరమ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో ఆర్సీబీ కోచ్ మైక్ హెస్సన్(RCB Coach Mike Hessen) ఒక శుభవార్త చెప్పాడు. ట్విట్టర్ వీడియోలో హెస్సన్ జోష్ హేజిల్‌వుడ్ ఇండియాకు వచ్చినట్లు ధృవీకరించారు. జోష్ హాజిల్‌వుడ్ ఏప్రిల్ 14న జట్టులో చేరతాడని చెప్పాడు. అలాగే.. శ్రీలంక(Sri Lanka) స్పిన్నర్ వనిందు హసరంగా(Wanindu Hasaranga) అందుబాటులో ఉండటంపై కూడా అతను సమాధానమిచ్చాడు. న్యూజిలాండ్‌ సిరీస్(New zealand Series) తర్వాత అతను జట్టులో చేరతాడ‌ని చెప్పాడు. వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్ జట్టులో చేరడంపై మైక్ హెస్సన్‌ను అడగ‌గా.. హసరంగా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో వారి జాతీయ జట్టుతో ఉన్నాడని చెప్పాడు. సిరీస్‌ ముగిసిన వెంటనే టీమ్‌లో చేరుతాడు. జోష్ హేజిల్‌వుడ్ కూడా ఏప్రిల్ 14న జట్టులో చేరనున్నాడని పేర్కొన్నాడు.

ఏప్రిల్ 15న ఢిల్లీతో(Delhi) జరిగే నాలుగో మ్యాచ్‌కు జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. రీస్ టాప్లీ భుజం సమస్యతో రెండు వారాల పాటు దూరం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో పేసర్ లేకపోవడం జట్టును దెబ్బతీస్తుంది. మహ్మద్ సిరాజ్(Mohammed Siraj), హర్షల్ పటేల్(Harshal Patel), ఆకాష్ దీప్ సింగ్(Akash deep singh) ఉన్నప్పటికీ.. విదేశీ పేసర్(Pacer) లేకపోవడం జట్టుకు ఒక వెలితిగా భావిస్తుంటాయి టీమ్ మేనేజ్‌మెంట్లు. ఆర్‌సీబీ (RCB)రెండో మ్యాచ్‌ గురువారం కేకేఆర్‌తో(KKR) ఆడనుంది. ఏప్రిల్ 10న‌ సోమవారం లక్నో సూపర్ జెయింట్‌తో(Lucknow super gaint) జట్టు మూడో మ్యాచ్ ఆడాల్సి ఉంది. నాల్గవ మ్యాచ్ వరకు హేజిల్‌వుడ్ జట్టుకు అందుబాటులోకి వ‌స్తాడు. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను(Mumbai indians) ఓడించి ఆర్‌సీబీ(RCB) టోర్నీని విజ‌యంతో ప్రారంభించింది.

ఆర్‌సీబీ జ‌ట్టు : ఫాఫ్ డు ప్లెసిస్ (captain), విరాట్ కోహ్లీ(Virat kohli), గ్లెన్ మాక్స్‌వెల్(Glen Maxwell), మహ్మద్ సిరాజ్(Mohammed Siraj), హర్షల్ పటేల్(Harshal Patel), వనిందు హసరంగా(Wanindu Hasaranga), దినేష్ కార్తీక్ (Dinesh Karthik (wicket keeper)), షాబాజ్ అహ్మద్(Shahbaz ahmed), అనుజ్ రావత్(Anuj Rawath), ఆకాష్ దీప్(akash deep), జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood), మహిపాల్ లోమ్రోర్(Mahipal Lomror), ఫిన్ అలెన్(Finn allen), సుయాష్ ప్రభుదేస్ శర్మ(Suyash Prabhudes Sharma), సిద్ధార్థ్ కౌల్(Siddharth kaul), డేవిడ్ విల్లీ(David villi), రీస్ టాప్లీ(reece Topley), హిమాన్షు శర్మ(Himanshu Sharma), మనోజ్ భాంగే(Manoj bange), రాజన్ కుమార్(rajan Kummar), అవినాష్ సింగ్(Avinash singh), సోను యాదవ్(sonu yadav), మైకేల్ బ్రేస్‌వెల్(Michael Bracewell).

Updated On 6 April 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story