స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఫ్యామిలీలో పెద్ద గొడవే అవుతోంది. పెళ్లయిన తర్వాత తన కొడుకు పూర్తిగా మారిపోయాడని, అందుకు తమ కోడలు రివాబనే కారణమని జడేజా తండ్రి అనిరుద్ సిన్హా(Anirudh Sinha) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా!

Ravindra Jadeja Family
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఫ్యామిలీలో పెద్ద గొడవే అవుతోంది. పెళ్లయిన తర్వాత తన కొడుకు పూర్తిగా మారిపోయాడని, అందుకు తమ కోడలు రివాబనే కారణమని జడేజా తండ్రి అనిరుద్ సిన్హా(Anirudh Sinha) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా! సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ, ఎంతో కష్టపడి కొడుకును క్రికెటర్‌గా చేస్తే ఇప్పుడు మొహం కూడా చూపడం లేదని ఆవేదన చెందాడు అనిరుద్‌సిన్హా. అతడిని నేరుగా కలిసే అవకాశం లేకుండా పోయిందని వాపోయాడు. జడేజా ఆస్తిపై
రివాబా, ఆమె తల్లిదండ్రుల పెత్తనం ఎక్కువయ్యిందని, చివరకు తమ మనవరాలిని కనీసం ఒక్కసారి కూడా చూడనివ్వలేదని అన్నాడు. అయితే తన తండ్రి ఆరోపణల్లో కొంచెం కూడా నిజం లేదని రవీంద్ర జడేజా అంటున్నాడు. తన తండ్రి వెర్షన్‌ను మీడియాలో ప్రసారం చేసే ముందు తన అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుంటుందని దైనిక్ భాస్కర్(Dainik Bhaskar)ను ఉద్దేశించి రవీంద్ర జడేజా కామెంట్ చేశాడు. దైనిక్ భాస్కర్ దురుద్దేశపూరితంగానే తన తండ్రి ఇంటర్వ్యూను ప్రసారం చేసిందని చెప్పాడు. ఇదిలా ఉంటే ఓ కార్యక్రమానికి హాజరైన జామ్ నగర్ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబాను ఇదే విషయంపై ఓ విలేకరి ప్రశ్న అడిగారు. దానికి రివాబా కోపగించుకుంది. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చామో నీకు తెలియదా అంటే ఎదురు ప్రశ్నించింది. వ్యక్తిగత విషయాల గురించి అడగాలంటే నేరుగా తనను వచ్చి కలవొచ్చు అని, అంతేగానీ ఇక్కడ ఆ విషయాలు మాట్లాడొద్దని రివాబా సదరు విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రివాబా సోలంకి జడేజా గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎన్నికల ప్రచారంలో రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు మద్దతునిస్తే, అతడి తండ్రి అనిరుధ్ సిన్హా, సోదరి నైనాబా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.
