Ravi Shastri : రోహిత్‌ను తప్పుబట్టిన రవిశాస్త్రి..!
సౌతాఫ్రికాతో(South africa) తొలిటెస్ట్‌లో భారత్(India) తలపడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రోహిత్(Rohith) నిర్ణయాలపై రవిశాస్త్రి(Ravi Shastri) అసంతృప్తి వ్యక్తం చేశారు. లంచ్ తర్వాత ఎప్పుడైనా బెస్ట్ బౌలర్‌తో బౌలింగ్ వేయించాలని తాను కోచ్‌గా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పానన్నారు.
సౌతాఫ్రికాతో(South africa) తొలిటెస్ట్‌లో భారత్(India) తలపడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రోహిత్(Rohith) నిర్ణయాలపై రవిశాస్త్రి(Ravi Shastri) అసంతృప్తి వ్యక్తం చేశారు. లంచ్ తర్వాత ఎప్పుడైనా బెస్ట్ బౌలర్‌తో బౌలింగ్ వేయించాలని తాను కోచ్‌గా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పానన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్(Shardul Thakur), ప్రసిద్ధ్ కృష్ణకు బౌలింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. లంచ్ బ్రేక్ తర్వాత ఉత్తమ బౌలర్‌ను ప్రయోగిస్తే ఫలితం మరోలా ఉండే అవకాశం ఉందన్నారు. కాగా ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 245 పరుగులకు భారత్ ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాకు 11 పరుగుల ఆధిక్యం లభించింది.