ఐపీఎల్(IPL)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటిన్స్(Gujarat Titans) ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ విజయంలో రింకూసింగ్(Rinku Singh) ఇన్నింగ్స్‌దే కీలక భూమిక. విజయానికి చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు అవసరమైనప్పుడు రింకూసింగ్ వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

Rashid Khan Makes New World Record
ఐపీఎల్(IPL)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటిన్స్(Gujarat Titans) ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ విజయంలో రింకూసింగ్(Rinku Singh) ఇన్నింగ్స్‌దే కీలక భూమిక. విజయానికి చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు అవసరమైనప్పుడు రింకూసింగ్ వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్‌ఖాన్(Rashid Khan) బౌలింగ్‌లో అద్భుతం సృష్టించాడు. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఈ క్రమంలో రషీద్ ఓ ప్రపంచ రికార్డును సాధించాడు. టీ-20 క్రికెట్(T-20 Cricket)లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు టీ-20 మ్యాచుల్లో రషీద్‌ఖాన్ నాలుగుసార్లు హ్యాట్రిక్ సాధించాడు. రషీద్ ఖాన్ తర్వాతి స్థానంలో అండ్రూ టై(Andrew Tye), మహ్మద్ షమీ(Mohammed Shami), అమిత్ మిశ్రా(Amit Mishra), రస్సెల్(Russell), తహీర్(Taheer) ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకు మూడుసార్లు హ్యాట్రిక్‌ను సాధించాడు. మరో విశేషమేమిటంటే రషీద్‌ఖాన్‌కు ఐపీఎల్‌లో ఇదే మొదటి హ్యాట్రిక్ కావడం.
