ఐపీఎల్‌-2023(IPL 2023)లో 26వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జ‌ట్ల‌ మధ్య జరగనుంది. అయితే నాలుగేళ్ల విరామం తర్వాత జైపూర్‌(Jaipur)లో ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌డం విశేషం. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం(Sawai Mansingh Stadium)లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు అద్భుతంగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్‌-2023(IPL 2023)లో 26వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జ‌ట్ల‌ మధ్య జరగనుంది. అయితే నాలుగేళ్ల విరామం తర్వాత జైపూర్‌(Jaipur)లో ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌డం విశేషం. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం(Sawai Mansingh Stadium)లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు అద్భుతంగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. లక్నో రెండో స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జైపూర్‌లో ఇరు జట్ల మధ్య గట్టి పోరు ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం రాజస్థాన్ హోమ్ గ్రౌండ్. ఈ మైదానంలో 52 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 37 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. 5 మ్యాచ్‌లు ర‌ద్ద‌య్యాయి. ఇక లక్నో జట్టు తొలిసారిగా ఈ మైదానంలో బ‌రిలోకి దిగుతుంది.

జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో పలువురు స్టార్ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. అజింక్యా రహానే (1,100), షేన్ వాట్సన్ (875), రాహుల్ ద్రవిడ్ (735), జోస్ బట్లర్ (434), సంజు శాంసన్ (398) లు ఈ గ్రౌండ్‌లో అత్య‌ధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లుగా ఉన్నారు. అజింక్యా రహానే ప్ర‌స్తుతం చెన్నైకు ఆడుతుండ‌గా.. జోస్ బట్లర్, సంజు శాంసన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా, వాట్సన్ ఐపీఎల్ కోచింగ్ స్టాప్‌గా సేవ‌లందిస్తున్నారు.

ఈ వేదికపై అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లుగా.. సిద్ధార్థ్ త్రివేది (36), షేన్ వార్న్ (20), షేన్‌ వాట్సన్ (19), కెవోన్ కూపర్ (17), శ్రేయాస్ గోపాల్ (15), జోఫ్రా ఆర్చర్ (12), జయదేవ్ ఉనద్కత్ (10), కృష్ణప్ప గౌతమ్ (8) రికార్డుల‌లో ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ సేన్, కుల్దీప్ సేన్ రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, KC కరియప్ప, జాసన్ హోల్డర్, డోనోవన్ ఫెరీరా (wk), కునాల్ రాథోర్, ఆడమ్ జంపా, ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్, జో రూట్

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, డేనియల్ సైమ్స్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ చరక్.

Updated On 19 April 2023 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story