☰
✕
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది.
x
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 13.2 ఓవర్లలో 28/0 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా 19, మెక్‌స్వీనీ 4 పరుగులతో ఉన్నారు. కాగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ రెండో టెస్టులో అనూహ్యంగా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 2 టెస్టులు ముగిసే సరికి 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.
ehatv
Next Story