బుధవారం రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ గౌహతి(Prabhsimran Singh Guwahati) గ్రౌండ్‌ను అల్లకల్లోలం చేశాడు. రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వేస్తున్నది బౌల్డా(Baulda), అశ్వినా(Ashwin), చహలా అన్నది పట్టించుకోలేదు. అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేశాడు. అందరికీ చుక్కలు చూపించాడు. 28 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్ ఓవరాల్‌గా 34 బాల్స్‌లో 60 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ప్రభ్ సిమ్రన్(Prabh simran)కు ఇదే మొదటి అర్థశతకం కావడం గమనార్హం.
బుధవారం రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ గౌహతి(Prabhsimran Singh Guwahati) గ్రౌండ్‌ను అల్లకల్లోలం చేశాడు. రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వేస్తున్నది బౌల్డా(Baulda), అశ్వినా(Ashwin), చహలా అన్నది పట్టించుకోలేదు. అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేశాడు. అందరికీ చుక్కలు చూపించాడు. 28 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన ప్రభ్‌సిమ్రన్ ఓవరాల్‌గా 34 బాల్స్‌లో 60 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ప్రభ్ సిమ్రన్(Prabhsimran)కు ఇదే మొదటి అర్థశతకం కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లు సాధించాడు.
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ప్రభ్ సిమ్రన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడివాడు అని నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. మూడేళ్లుగా పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడుతున్న ప్రభ్ సిమ్రన్ ఇంతకాలానికి క్రికెట్ లవర్స్ దృష్టిలోపడ్డాడు. ఇప్పటి వరకు ఇతడు మూడుసార్లు వేలానికి వెళ్లాడు. ఈ మూడుసార్లూ పంజాబ్ కింగ్స్ టీమే ప్రభ్‌ను సొంతం చేసుకుంది. రెండువేల సంవత్సరం ఆగస్టు పదిన పాటియాలలో పుట్టాడు ప్రభ్‌సిమ్రాన్.. 2018లో డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడటం మొదలుపెట్టాడు. 2022లో మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్ సిమ్రన్ 689 పరుగులు చేశాడు. 24 ఏ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.. వీటిలో 664 పరుగులు చేయగలిగాడు. ఇప్పటి వరకు 42 టీ-20 మ్యాచ్‌లు ఆడి 1179 పరుగులు చేశాడు. ఐపీఎల్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు. వీటిల్లో రాజస్తాన్‌పై చేసిన 60 పరుగులు కూడా ఉన్నాయి.