పంజాబ్ జట్టు 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్

ఐపీఎల్ 2024లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. పంజాబ్ జట్టు మీద ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. చంఢీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో విజయాన్ని. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ అద్భుతంగా ఆడాడు.

పంజాబ్ జట్టు 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్ శర్మ క్రీజులోకి వచ్చి దుమ్ము దులిపాడు. దాదాపు పంజాబ్ ను గెలిపించినంత పని చేశాడు. 28 బంతుల్లో 61 పరుగులు కొట్టి.. పంజాబ్ ను విజయం ముంగిట నిలిపాడు. చివరిలో అతడు ఔట్ కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లో రనౌట్ పంజాబ్ కొంప ముంచింది. ఇంకా 5 బంతులు ఉండగానే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో కోయిట్జి, బుమ్రా, ఆకాశ్ మధ్వల్ తలో మూడు వికెట్లు తీశారు. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్ (6), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (0), రూసో (1), లియామ్ లివింగ్‌స్టోన్ (1), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (13), జితేశ్ శర్మ (9), కగిసో రబాడ (8) అర్షదీప్ సింగ్ (1) విఫలమయ్యారు. శశాంక్ సింగ్ (41), ఆశ్‌తోశ్ శర్మ (61), హర్‌ప్రీత్ బ్రార్ (19) రాణించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34 నాటౌట్), రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రాన్ 2, రబాడ 1 చొప్పున వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ తో ముంబై జట్టు 7 మ్యాచ్ లలో 3 విజయాలు సాధించగా.. పంజాబ్ 7 మ్యాచ్ లలో 2 విజయాలను మాత్రమే అందుకుంది.

Updated On 18 April 2024 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story