ఐపీఎల్-2024 వేలంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. దుబాయ్‌లోని(Dubai) కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఈ వేలం పాటలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta) చిన్న పొరపాటు చేశారు. ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొన్నారు. వెంటనే ఆమె తన తప్పు తెలుసుకున్నారు. దిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్‌కు(Punjab kings) లాక్ చేసినట్లు వేలం నిర్వాహకులు ప్రకటించారు.
ఐపీఎల్-2024 వేలంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. దుబాయ్‌లోని(Dubai) కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఈ వేలం పాటలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta) చిన్న పొరపాటు చేశారు. ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొన్నారు. వెంటనే ఆమె తన తప్పు తెలుసుకున్నారు. దిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్‌కు(Punjab kings) లాక్ చేసినట్లు వేలం నిర్వాహకులు ప్రకటించారు. ఐపీఎల్(IPL) నిబంధనల ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతడిని వేలానికి విడిచిపెట్టలేము. అసలేం జరిగిందంటే ఛత్తీస్‌గడ్‌కు చెందిన 32 ఏళ్ల ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్(Sashank singh) పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ సింగ్‌ను 20 లక్షలు పెట్టి కొనేసింది. శశాంక్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. శశాంక్‌ను తాము సొంతం చేసుకున్నట్టు నిర్వాహకులు ప్రకటించిన తర్వాతే తాము పొరపాటుపడ్డామని తెలుసుకున్నారు. అప్పటికే టైమ్ దాటిపోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయారు. తాము పొరబడ్డామని గ్రహించిన క్షణంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్‌ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. కాకపోతే శశాంక్ సింగ్ మరీ తీసిపారేసే ఆటగాడేం కాదు.. ఇప్పటి వరకు 55 టీ-20 మ్యాచ్‌లు ఆడిన శశాంక్ 724 పరుగులు చేశాడు. 15 వికెట్లు కూడా తీసుకున్నాడు. 2022లో శశాంక్‌ను సన్‌రైజర్స్(Sunrisers) వేలానికి విడిచిపెట్టింది. 2023 సీజన్ వేలంలో ఇతడిని ఎవరూ కొనలేదు. ఈసారి వేలంలో కూడా పంజాబ్ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals) కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకున్నారు.