టీ-20 క్రికెట్‌లో(T-20 Cricket) పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ ప్రపంచ రికార్డు సాధించింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ లో జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో(KKR) జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది.

టీ-20 క్రికెట్‌లో(T-20 Cricket) పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ ప్రపంచ రికార్డు సాధించింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ లో జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో(KKR) జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ పెద్ద టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అది కూడా 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇంతకు ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. లాస్టియర్‌ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 259 పరుగుల టార్గెట్‌ను ఛేదిచింది. ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇక ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో ఇదే అత్యధిక ఛేజింగ్‌. నిన్నటి వరకు ఈ రికార్డు రాజస్తాన్‌ రాయల్స్‌ పేరిట ఉండింది. 2020 ఐపీఎల్ సీజ‌న్‌లో పంజాబ్‌పై 224 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.

Updated On 27 April 2024 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story