ఐపీఎల్ 16వ సీజన్(IPL Season 16)లో ఆటగాళ్ల గాయాలు అన్ని జట్లకు పెద్ద సమస్యగా మారాయి. ప్రతి జట్టు ఈ సమస్యతో పోరాడుతోంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals)తో పంజాబ్ కింగ్స్(Punjab Kings) రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మ్యాచ్‌కు ముందు ఓ వార్త టీమ్‌ని టెన్షన్‌లో పడేసింది. అండర్-19 ప్రపంచకప్(U-19 World Cup)లో టీమిండియా(TeamIndia) తరఫున ఆడి బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ అద్భుతాలు చేసిన స్టార్ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బావా(Raj Angad Bawa) మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఐపీఎల్ 16వ సీజన్(IPL Season 16)లో ఆటగాళ్ల గాయాలు అన్ని జట్లకు పెద్ద సమస్యగా మారాయి. ప్రతి జట్టు ఈ సమస్యతో పోరాడుతోంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals)తో పంజాబ్ కింగ్స్(Punjab Kings) రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మ్యాచ్‌కు ముందు ఓ వార్త టీమ్‌ని టెన్షన్‌లో పడేసింది. అండర్-19 ప్రపంచకప్(U-19 World Cup)లో టీమిండియా(TeamIndia) తరఫున ఆడి బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ అద్భుతాలు చేసిన స్టార్ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బావా(Raj Angad Bawa) మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకు ముందు పంజాబ్ జట్టు గాయం కారణంగా జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow)ను కూడా కోల్పోయింది. ఇటువంటి పరిస్థితులో ఇది టీమ్‌కు కోలుకోలేని దెబ్బ.
ఈ సమాచారాన్ని ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్(Twitter handle)లో పత్రికా ప్రకటన ద్వారా షేర్ చేశారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, రైట్ ఆర్మ్ బౌలర్ రాజ్ అంగద్ బావా ఎడమ భుజానికి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగినట్లు సమాచారం. రాజ్ పంజాబ్ కింగ్స్ తరుపున గత సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి 11 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఇప్పుడు రాజ్ ఈ సీజన్ మొత్తానికి దూరమవడం అతని కెరీర్ కు కూడా పెద్ద దెబ్బ.
రాజ్ అంగద్ బావా స్థానాన్ని పంజాబ్ కింగ్స్ గుర్నూర్ సింగ్ బ్రార్(Gurnoor Singh Brar) తో భర్తీ చేసింది టీమ్ మేనేజ్‌మెంట్. గుర్నూర్ సింగ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. ఆల్ రౌండర్. గుర్నూర్ డిసెంబర్ 2022లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 107 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు కూడా పడగొట్టాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జానీ బెయిర్‌స్టో స్థానంలో మాథ్యూ షార్ట్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
పంజాబ్ కింగ్స్ జట్టు(Punjab Kings Team) : శిఖర్ ధావన్ (c), షారుఖ్ ఖాన్, మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ (wk), రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, బల్తేజ్ సింగ్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రర్, రాహుల్ చాహర్ , సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవిరప్ప, శివమ్ సింగ్, గుర్నూర్ సింగ్ బ్రార్, మోహిత్ రాథీ.