ఐపీఎల్‌-16వ ఎడిషన్‌లో పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) వరుసగా రెండో విజయం సాధించింది. గౌహతి ఆతిథ్యమిచ్చిన మొట్టమొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌(Rajasthan Royals)పై పంజాబ్‌ కింగ్స్‌ అయిదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan) 56 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(Prabhsimran Singh) 34 బంతుల్లో ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసి ప్రేక్షకులను రంజింపచేశాడు.

ఐపీఎల్‌-16వ ఎడిషన్‌లో పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) వరుసగా రెండో విజయం సాధించింది. గౌహతి ఆతిథ్యమిచ్చిన మొట్టమొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌(Rajasthan Royals)పై పంజాబ్‌ కింగ్స్‌ అయిదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan) 56 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(Prabhsimran Singh) 34 బంతుల్లో ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసి ప్రేక్షకులను రంజింపచేశాడు. హోల్డర్‌ 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తర్వాత బరిలో దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు మాత్రమే చేయగలిగింది. శాంసన్‌ 25 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు, హెట్‌మయర్‌ 18 బంతుల్లో ఒక బౌండరీ, మూడు సిక్సర్లతో 36 పరుగులు, ధ్రువ్‌ జూరెల్‌ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 32 పరుగులు చేసి పంజాబ్‌పై కాసింత ఒత్తిడి తీసుకురాగలిగారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నాథన్ ఎలిస్‌ 30 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకుని ప్రత్యర్థి గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు.

198 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో రాజస్తాన్‌(Rajasthan) విఫలం చెందింది. ఇన్నింగ్స్‌ మొదటి బంతికే యశస్వి సిక్సర్‌ కొట్టి టార్గెట్‌ను ఘనంగా మొదలు పెట్టాడు. అయితే ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు బట్లర్‌ వేలికి గాయమయ్యింది. దాంతో అతడి ప్లేస్‌లో ఓపెనర్‌గా అశ్విన్‌ వచ్చాడు. ఈ ప్రయోగం సక్సెస్‌ కాలేదు. అర్ష్‌దీప్‌ తన వరుస ఓవర్లలో యశస్వీ, అశ్విన్‌లను అవుట్ చేశాడు. యశస్వి 11 పరుగులు చేయగా, అశ్విన్‌ సున్నాకే అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్‌ దాటిగా ఆడటం మొదలు పెట్టాడు. మూడో స్థానంలో వచ్చిన బట్లర్‌ ఎక్కవ సేపు బరిలో నిల్చోలేకపోయాడు. ఆరు ఓవర్లలో పంజాబ్‌ మూడు వికెట్లకు 57 పరుగులు చేసింది. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. మరోవైపు ఎలిస్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టబోయి శాంసన్‌ అవుటయ్యాడు. సొంతగడ్డపై మొదటిసారి ఐపీఎల్‌లో ఆడుతున్న అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్‌ ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. రెండో విడత బౌలింగ్‌కు వచ్చిన ఎలిస్‌ ఓకే ఓవర్‌లో పరాగ్‌, పడిక్కల్‌ను అవుట్‌ చేయడంతో పంజాబ్‌ విజయం దాదాపుగా ఖరారయ్యింది. అప్పటికి విజయం కోసం రాజస్తాన్‌కు 4 ఓవర్లలో 69 పరుగులు కావాలి. ఈ దశలో హెట్‌మయర్‌, ధ్రువ్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌ను కాసేపు వణికించారు. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో హెట్‌మయర్‌ రెండు సిక్సర్లు, ఓ బౌండరీ సాధించాడు. అర్షదీప్‌ వేసిన 19వ ఓలర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ధ్రువ్‌ వరుసగా ఫోర్‌, సిక్సర్‌, ఫోర్‌ కొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో పంజాబ్‌కు 16 పరుగులు అవసరమయ్యాయి. కరన్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. మూడో బంతికి హెట్‌మయర్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి రెండు బాల్స్‌లో 11 పరుగులు అవసరమయ్యాయి. అయిదో బంతికి ఒకే పరుగు రావడంతో పంజాబ్‌ గెలుపొందింది.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభు సిమ్రాన్‌, ధావన్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరు 90 పరుగులు జోడించారు. ఆ టైమ్‌లో పంజాబ్‌ ఈజీగా 220 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ రాజస్తాన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా 200 పరుగులను దాటలేకపోయింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభు సిమ్రన్‌ బ్యాటింగే ఆకర్షణగా నిలిచింది. క్రికెట్‌లో ఇప్పటి వరకు చూడని షాట్లను ఇతడు ఆడాడు. సిక్సర్లు, బౌండరీలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఐపీఎల్‌లో మొదటి హాఫ్‌ సెంచరీని సాధించాడు. చివరకు హోల్డర్ బౌలింగ్‌లో బట్లర్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ప్రభుసిమ్రన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరుబోర్డు

పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings)
ప్రభ్‌సిమ్రాన్‌ (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 60; ధావన్‌ నాటౌట్‌ 86; భానుక రిటైర్డ్‌హర్ట్‌ 1; జితేశ్‌ (సి) పరాగ్‌ (బి) చాహల్‌ 27; సికందర్‌ (బి) అశ్విన్‌ 1; షారుక్‌ ఖాన్‌ (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 11; సామ్‌ కరన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 197; వికెట్ల పతనం: 1-90, 2-158, 3-159, 4-196; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-38-0; అసిఫ్‌ 4-0-54-0; అశ్విన్‌ 4-0-25-1; హోల్డర్‌ 4-0-29-2; చాహల్‌ 4-0-50-1

రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals)
యశస్వి (సి) షార్ట్‌ (బి) అర్ష్‌దీప్‌ 11; అశ్విన్‌ (సి) ధావన్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; బట్లర్‌ (సి) అండ్‌ (బి) ఎలిస్‌ 19; శాంసన్‌ (సి) షార్ట్‌ (బి) ఎలిస్‌ 42; దేవ్‌దత్‌ (బి) ఎలిస్‌ 21; పరాగ్‌ (సి) షారుక్‌ (బి) ఎలిస్‌ 20; హెట్‌మయర్‌ రనౌట్‌ 36; ధ్రువ్‌ జూరెల్‌ నాటౌట్‌ 32; హోల్డర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192; వికెట్ల పతనం: 1-13, 2-26, 3-57, 4-91, 5-121, 6-124, 7-186; బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 4-0-44-0; అర్ష్‌దీప్‌ 4-0-47-2; హర్‌ప్రీత్‌ 2-0-15-0; ఎలిస్‌ 4-0-30-4; రాహుల్‌ చాహర్‌ 4-0-31-0; సికందర్‌ రజా 2-0-24-0

Updated On 6 April 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story