ఆఫ్ఘనిస్తాన్‌తో(Afghanisthan) జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్(pakisthan) 59 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో పాక్‌ తరఫున బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. కాగా.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1 జట్టుగా అవతరించింది.

ఆఫ్ఘనిస్తాన్‌తో(Afghanisthan) జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్(pakisthan) 59 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో పాక్‌ తరఫున బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. కాగా.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1 జట్టుగా అవతరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ 118.48 రేటింగ్ పాయింట్లతో అగ్ర‌స్థానంలో.. ఆస్ట్రేలియా 118 రేటింగ్ పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాయి. అయితే.. ఆసియా కప్ తర్వాత ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది.

బాబర్ అజామ్(Babar Azam Khan) కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. గతేడాది వెస్టిండీస్‌, నెదర్లాండ్‌లను ఓడించింది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌పై 2-1తో విజయం సాధించింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై 3-0తో సిరీస్ గెలిచి పాకిస్థాన్ నంబర్-1 ర్యాంక్‌కు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో.. తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో 59 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే ర్యాంకింగ్స్‌లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌, ఆసియా క‌ప్ నేప‌థ్యంలో ర్యాంకింగ్స్ ఏ మాత్రం ప్ర‌భావం చూపుతాయో చూడాలి మ‌రి

Updated On 27 Aug 2023 6:00 AM GMT
Ehatv

Ehatv

Next Story