☰
✕
x
ICC పురుషుల T20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ దశలోనే పాకిస్థాన్ జట్టు నిష్క్రమించింది. అనుకున్నట్లుగా ఆడలేదు పాక్ జట్టు. దీంతో బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టుపై పాక్ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్ జట్టులో "ఐక్యత" లేదని అన్నారు. తన సుదీర్ఘ కోచింగ్ కెరీర్‌లో అలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని గ్యారీ తెలిపాడు. గ్యారీని T20 ఈవెంట్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) కోచ్ గా ఎంపిక చేసింది. దీంతో బాబర్ అజామ్ జట్టు టోర్నీలో అద్భుతాలు చేస్తుందేమో అని ఆశించారు. అయితే లీగ్ దశను దాటి సూపర్ 8 కు కూడా పాక్ జట్టు చేరుకోలేకపోయింది.
పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. 2011లో భారత్‌ను ODI ప్రపంచ కప్ విజయానికి మార్గనిర్దేశం చేసిన కిర్‌స్టన్.. T20 ప్రపంచకప్ నుండి నిష్క్రమించిన తర్వాత పాక్ జట్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. "పాకిస్థాన్ జట్టులో ఐక్యత లేదు. వారు దానిని జట్టు అని పిలుస్తారు, కానీ అది జట్టు కాదు. వారు ఒకరికొకరు మద్దతు ఇవ్వరు. అందరూ విడిపోయారు. నేను చాలా జట్లతో పనిచేశాను, కానీ నేను అటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు" అని కిర్‌స్టన్ వ్యాఖ్యలు చేసినట్లు పాక్ మీడియా తెలిపింది.
Eha Tv
Next Story