సచిన్‌ తెందూల్కర్‌ గొప్పా? విరాట్‌ కోహ్లీ గొప్పా? ఈ డిబేట్‌ నడుస్తూనే ఉంది.
కొందరు సచిన్‌కు ఓటేస్తే , మరికొందరు విరాట్‌కు జై అంటున్నారు. రికార్డుల పరంగా సచిన్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడన్నది నిర్వివాదాంశం. పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ మాత్రం కోహ్లీ కంటే సచిన్‌ తెందూల్కరే గొప్ప అని అంటున్నాడు.

సచిన్‌ తెందూల్కర్‌ గొప్పా? విరాట్‌ కోహ్లీ గొప్పా? ఈ డిబేట్‌ నడుస్తూనే ఉంది.

కొందరు సచిన్‌కు ఓటేస్తే , మరికొందరు విరాట్‌కు జై అంటున్నారు. రికార్డుల పరంగా సచిన్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడన్నది నిర్వివాదాంశం. పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ మాత్రం కోహ్లీ కంటే సచిన్‌ తెందూల్కరే గొప్ప అని అంటున్నాడు. ఆయనను మించిన వారు ఎవరూ లేరనీ, ఇది తన మాట కాదని, ప్రపంచమంతా అంగీకరించే నిజమని సక్లయిన్‌ ముస్తాన్‌ అభిప్రాయపడుతున్నారు. ఏదైనా షాట్‌ గురించి మాట్లాడుతున్నప్పడు తప్పనిసరిగా ప్రతీ ఒక్కరు సచిన్‌ ఆట తీరునే ఎగ్జాంపుల్‌గా చెబుతారని సక్లయిన్‌ తెలిపాడు. విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాడే కావొచ్చు కానీ సచిన్‌ తర్వాతే ఎవరైనా అని పాక్‌ మాజీ బౌలర్‌ అంటున్నాడు. సచిన్‌ టఫెస్ట్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడనీ, కోహ్లీకి ఆ అవకాశం లేకుండా పోయిందని చెప్పాడు. వసీం అక్రమ్‌, వాల్ష్‌, ఆంబ్రోస్‌, మెక్‌గ్రాత్‌, షేన్‌వార్న్‌, మురళీధరన్‌ వంటి దిగ్గజ బౌలర్లను సచిన్‌ ఎదుర్కొన్నాడు కానీ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నాడా అని ప్రశ్నించాడు. వీరందరి బౌలింగ్‌ను సచిన్‌ సునాయాసంగా ఎదుర్కొన్నాడని, ఈ బౌలర్లకు బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా ఎలా నిరోధించాలో బాగా తెలుసని, అలాగే ఎలా ట్రాప్‌లో పడేయాలో కూడా తెలుసని సక్లయిన్‌ ముస్తాన్‌ అన్నాడు. ఎలా చూసినా కోహ్లీ కంటే సచిన్‌ ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంటాడని చెబుతూ అసలైన GOAT సచినేనని అన్నాడు. GOAT అంటే Greatest of All Time అట!

ఈ మధ్య చాలా మంది కోహ్లీతో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజామ్‌లో పోలుస్తున్నారు. సక్లయిన్‌ కూడా ఇద్దరికీ పోలిక పెడుతూ ఇద్దరూ ప్రపంచ క్రికెట్‌లో తమకు తామే సాటి నిరూపించకున్నారని, అయితే కోహ్లీ కంటే బాబర్‌ కవర్‌ డ్రైవ్‌లను చక్కగా ఆడగలడని సక్లయిన్‌ చెప్పాడు. పాపం సక్లయిన్ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో కానీ కోహ్లీ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. సచిన్‌ను మెచ్చుకుంటే మెచ్చుకోండి కానీ కోహ్లీ కంటే బాబారే గ్రేట్‌ అనడం బాగోలేదని అంటున్నారు. కోహ్లీని బాబర్‌తో పోల్చి ప్రపంచ మేటిగాడి స్థాయిని తగ్గించవద్దని హితవు చెబుతున్నారు.

Updated On 17 March 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story