న్యూజిలాండ్(New Zealand)తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్(T-20 Series)లో పాకిస్తాన్(Pakistan) శుభారంభం చేసింది. లాహోర్(Lahore)లో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫఖర్ జమాన్(Fakhar Zaman) 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేయగా
న్యూజిలాండ్(New Zealand)తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్(T-20 Series)లో పాకిస్తాన్(Pakistan) శుభారంభం చేసింది. లాహోర్(Lahore)లో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫఖర్ జమాన్(Fakhar Zaman) 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేయగా, సయీమ్ అయూబ్ 28 బంతుల్లో ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. హెన్రీ(Henry) మూడు వికెట్లు తీసుకు్నాడు. తర్వాత బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పేసర్ల ధాటికి 94 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్(Haris Rauf)నాలుగు వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్‌మాన్ 34 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam )కు ఇది వందో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో బాబర్ తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగాడు.