సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత జట్టు పరువును నిలబెట్టాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత జట్టు పరువును నిలబెట్టాడు. అర్ధసెంచరీ చేసి బ్యాట్‌తో అల్లు అర్జున్‌ను ఇమిటేట్‌ చేశాడు. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్ కూడా 50 పరుగులు చేసి నితీష్‌కుమార్‌రెడ్డికి అద్భుతమైన సహకరాన్ని అందించాడు. దీంతో నితీష్‌కుమార్‌రెడ్డి బ్యాట్‌తో తగ్గేదేలా అనేలా పుష్ప సిగ్నేచర్ సీన్‌ను రిపీట్‌ చేశాడు. సెంచరీ చేసిన సందర్భంగా నితీష్‌ను చూసి తండ్రి ఆనందభాష్పాలు రాల్చాడు. తన కుమారుడిని చూసి ఎమోషనల్‌ అయ్యాడు. తన తండ్రి ఫొటోను జత చేస్తూ నితీష్‌కుమార్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్‌ చేశాడు. ' మీ తండ్రిని గర్వ పడేలా చేసే అనుభూతి దేనికి సాటి రాదంటూ' అర్థం వచ్చేలా ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. 105 పరుగులతో నితీష్‌కుమార్‌రెడ్డి, రెండు పరుగులతో సిరాజ్ క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా కంటే భారత్ 116 పరుగులు వెనకబడి ఉంది. 164 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును నితీష్ తన అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ పేరును నిలబెట్టాడు.

ehatv

ehatv

Next Story