ఉత్కంభరితమైన మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌కు భావోద్వేగాలు ఉండటం సహజమే! కానీ అవి హద్దుమీరకూడదు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పేస్ బౌలర్ అవేష్ ఖాన్(Avesh Khan) ఇలాగే హద్దు మీరాడు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో విజయం సాధించడానికి లక్నో టీమ్‌కు అయిదు పరుగులు అవసరమయ్యాయి. ఈ కీలకమైన ఓవర్ హర్షల్ పటేల్(Harshal Patel) వేశాడు.
ఉత్కంభరితమైన మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌కు భావోద్వేగాలు ఉండటం సహజమే! కానీ అవి హద్దుమీరకూడదు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పేస్ బౌలర్ అవేష్ ఖాన్(Avesh Khan) ఇలాగే హద్దు మీరాడు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో విజయం సాధించడానికి లక్నో టీమ్‌కు అయిదు పరుగులు అవసరమయ్యాయి. ఈ కీలకమైన ఓవర్ హర్షల్ పటేల్(Harshal Patel) వేశాడు. మొదటి బంతికి జయదేవ్ ఉనద్కట్ సింగిల్ తీశాడు. వుడ్ స్ర్టయింగ్ ఎండ్‌కు వచ్చాడు. అయితే రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత బరిలో దిగిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు చేశాడు. నాలుగో బంతికి బిష్ణోయ్ ఓ సింగిల్ తీసి ఉనద్కట్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. అప్పటికీ స్కోర్లు సరిసమానమయ్యాయి. లక్నో గెలుపుకు ఒక పరుగు అవసరమయ్యింది. అయిదో బంతికి ఉనద్కట్ అవుటయ్యాడు. దాంతో మైదానంలోని ప్రేక్షకులు ఉత్కంఠతకు లోనయ్యారు. చివరి బంతికి లక్నోకు ఒక పరుగు అవసరమయ్యింది. హర్షల్ పటేల్ వేసిన చివరి బంతిని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అందుకోలేకపోయాడు. ఫలితంగా బై రూపంలో లక్నోకు ఓ పరుగు వచ్చింది. అవేశ్, బిష్ణోయ్‌లు వేగంగా పరుగెత్తి లక్నోకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. చివరి బంతికి థ్రిలింగ్ విక్టరీని సాదించిన లక్నో సంబరాల్లో పడిపోయింది. విక్టరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నప్పుడు అవేష్‌ఖాన్ అనుచితంగా ప్రవర్తించాడు. చివరి బంతికి పరుగు తీసిన వెంటనే అవేష్ తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అవేష్ చర్యను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కనీసం బాల్‌ను టచ్ చేసే టాలెంట్ లేదు.. నీకు ఇంత ఓవరాక్షన్ అవసరమా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతున్నారు. పోనీ బౌలింగ్‌లో అయినా రాణించాడా అంటే అదీ లేదు. నాలుగు ఓవర్లలో ప్రత్యర్థి టీమ్‌కు 53 పరుగులు ఇచ్చుకున్నాడు. అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు.