ఐపీఎల్‌(IPL)లో సోమ‌వారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants) జ‌ట్ల‌ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ(RCB) జట్టు లక్నోకు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చివరి బంతికి మ్యాచ్‌ను కోల్పోవాల్సివ‌చ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి సీజన్‌లో అభిమానులకు ఇలాంటి షాక్‌లు ఇస్తూనే ఉంటుంది.

ఐపీఎల్‌(IPL)లో సోమ‌వారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants) జ‌ట్ల‌ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ(RCB) జట్టు లక్నోకు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చివరి బంతికి మ్యాచ్‌ను కోల్పోవాల్సివ‌చ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి సీజన్‌లో అభిమానులకు ఇలాంటి షాక్‌లు ఇస్తూనే ఉంటుంది. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా(Social Meida)లో జనాలు రకరకాలుగా స్పందించారు.

213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు నికోలస్ పూరన్(Nicholas Pooran), మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) లు రాణించ‌డంతో లక్ష్యానికి చేరువైంది. అయితే.. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యాక‌.. మ్యాచ్ చాలా కష్టంగా మారింది. చివరి బంతికి.. లక్నో విజయానికి ఒక పరుగు అవసరం. చివ‌రి వికెట్. ఆ ఒక్క పరుగును ఆపడంలో ఆర్సీబీ ఆటగాళ్లు విఫలమవడంతో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

ఆర్‌సీబీకి ఎప్పుడూ అభిమాని కావద్దు అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశాడు. విజయం అభిమానులను ఇస్తుంది. ప‌రాజ‌యం నిజమైన అభిమానులను ఇస్తుందని మ‌రొక‌రు రాసుకొచ్చారు. మ‌రొక‌రు.. ఏడుస్తున్న లేడీ ఆర్సీబీ ఫ్యాన్ ఫోటోను షేర్ చేస్తూ.. ఆమె ఆర్సీబీ అభిమానుల బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. ఆర్సీబీ అభిమానులు రాబోయే దారుణమైన రోజుల కోసం సిద్ధంగా ఉండండ‌ని మ‌రొక‌రు రాసుకొచ్చారు. ర‌క‌క‌రాల మీమ్స్‌, వీడియోల‌తో సోష‌ల్ మీడియాను నెటిజ‌న్లు షేక్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌ చేజింగ్‌లో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో.. మార్కస్ స్టోయినిస్ 30 బంతుల్లో 65 ప‌రుగులు.. నికోలస్ పూరన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేయ‌డంతో విజ‌యం సాదించింది. పూరన్ వికెట్ పడిన తర్వాత లక్నో గెలుస్తుంద‌న్న ఆశ‌లు లేవు. అనుకున్న‌ది జ‌రిగితే అది ఐపీఎల్ ఎందుక‌వుతుంది. ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్ గెలిచారు. గ్లెన్ మాక్స్‌వెల్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు వృధా అయ్యాయి.

Updated On 11 April 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story