సర్ఫరాజ్ ఖాన్‌కు(Sarfaraz Khan) మళ్లీ నిరాశే ఎదురయ్యింది. టీమిండియాలో(Team India) చోటు దక్కించుకోవాలన్న అతడి ఎదురుచూపులకు ఎప్పుడు ముగింపు పలుకుతుందో ఏమో!
ఇంగ్లండ్‌తో(England) రెండో టెస్టు మ్యాచ్‌తో సర్ఫరాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో(International Cricket) అడుగుపెట్టడం ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు. భారత మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
సర్ఫరాజ్ ఖాన్‌కు(Sarfaraz Khan) మళ్లీ నిరాశే ఎదురయ్యింది. టీమిండియాలో(Team India) చోటు దక్కించుకోవాలన్న అతడి ఎదురుచూపులకు ఎప్పుడు ముగింపు పలుకుతుందో ఏమో!
ఇంగ్లండ్‌తో(England) రెండో టెస్టు మ్యాచ్‌తో సర్ఫరాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో(International Cricket) అడుగుపెట్టడం ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు. భారత మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం సర్ఫరాజ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. తుది జట్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్‌కు చోటిచ్చి సర్ఫరాజ్‌కు మొండిచేయి చూపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 'సర్ఫరాజ్ ఖాన్‌కు మళ్లీ అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా? అని ఓ నెటిజన్ సూటిగా అడిగాడు. 'మీ నిర్ణయాలు మాకు అర్థం కావడం లేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ కొట్టి ఫుల్లు పామ్‌లో ఉన్నాడు. అయినా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’ అని సెలక్టర్లను తిట్టిపోశాడో నెటిజన్. పాపం టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు సర్ఫరాజ్ కూడా తనకు టీమ్‌లో చోటు ఖాయమని అనుకున్నాడు. 'టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపిక కావాలి. జీవితంలో కొన్ని సార్లు మనం తొందరపాటులో పనులు చేస్తుంటాము. నేను కూడా అంతే. వీలైనంత తొందరగా భారత జట్టులో చోటు సంపాదించుకోవాలని తహతహలాడాను. ప్రతీసారి నిరాశే ఎదురయ్యేది. కొన్నిసార్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. అప్పుడు మా నాన్న నన్ను ఓదార్చేవాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడు. కఠోరశ్రమ చేస్తూనే ఉండాలి.ఎప్పుడో ఓసారి ఫలితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు అని చెబుతుండేవారు. ఆత్మవిశ్వాసం, ఓపిక ఎంతో అవసరమని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మా నాన్న ఎంతో ఆనందంగా ఉన్నారు. కోట్లాది మంది ఉన్న ఈ దేశంలో క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది' అని సర్ఫరాజ్ చెప్పాడు. మొహిందర్ అమర్‌నాథ్ అన్నట్టుగా సెలెక్టర్లు బంచ్ ఆఫ్ జోకర్లే!