బుధవారం మంగోలియాతో జరిగిన ఆసియా గేమ్స్(Asia) గ్రూప్ మ్యాచ్‌లో నేపాల్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. హాంగ్‌జౌలో జరిగిన పురుషుల క్రికెట్ ప్రారంభ మ్యాచ్‌లో నేపాల్ టీ20 క్రికెట్‌లో(T20 Cricket) అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
బుధవారం మంగోలియాతో జరిగిన ఆసియా గేమ్స్(Asia) గ్రూప్ మ్యాచ్‌లో నేపాల్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. హాంగ్‌జౌలో జరిగిన పురుషుల క్రికెట్ ప్రారంభ మ్యాచ్‌లో నేపాల్ టీ20 క్రికెట్‌లో(T20 Cricket) అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
మంగళవారం ప్రారంభమైన పురుషుల ఈవెంట్‌లోని మొదటి మ్యాచ్‌లోనే నేపాల్ ప్రపంచ రికార్డు(World Record) సృష్టించింది. నేపాల్(Nepal) 20 ఓవర్లలో 314 పరుగులు చేసి.. టీ20 క్రికెట్ చరిత్రలో 300 మార్క్ దాటిన తొలి జట్టుగా నిలిచింది. ఆసియా క్రీడల మ్యాచ్‌లకు అంతర్జాతీయ టీ20 హోదా కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే ధృవీకరించింది.
అంతేకాదు.. వేగవంతమైన టీ20 అర్ధ సెంచరీ రికార్డును కూడా దీపేందర్ సింగ్ ఎయిరీ(Deepender Singh Airy) బద్దలు కొట్టాడు. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌పై యువరాజ్(Yuvraj) 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. కాగా.. దీపేంద్ర సింగ్ అయిరి తొమ్మిది బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతను 10 బంతుల్లో 52 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.. అందులో 48 పరుగులు సిక్సర్ల ద్వారా వచ్చాయి.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్‌లను దాటేసి కుశాల్ మల్లా అత్యంత వేగవంతమైన T20 సెంచరీని బాదాడు. కేవలం 34 బంతుల్లోనే కుశాల్ మల్లా సెంచరీ పూర్తి చేశాడు. కాగా రోహిత్, మిల్లర్ 35 బంతుల్లో సెంచరీలు సాధించారు. మల్లా ఎనిమిది ఫోర్లు, 12 సిక్సర్లతో 50 బంతుల్లో 137 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ క్రికెట్ ఫీల్డ్‌లో నేపాల్ తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది, ఓపెనర్లు ఇద్దరూ 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడారు. అనంతరం కెప్టెన్ రోహిత్ పాడెల్ (27 బంతుల్లో 61 పరుగులు)తో కలిసి 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా మల్లా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. దీని తర్వాత దీపేంద్ర చివర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 314 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా జట్టు 13.1 ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది