ఎవ‌ర‌న్నారండి టెస్ట్ మ్యాచ్‌లకు ఆద‌ర‌ణ త‌గ్గింద‌ని.? ఒక‌వేళ అలా అనుకునేవాళ్లు ఎవ‌రైనా ఉంటే అహ్మ‌ద‌బాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను చూడండి!

ఎవ‌ర‌న్నారండి టెస్ట్ మ్యాచ్‌లకు ఆద‌ర‌ణ త‌గ్గింద‌ని.? ఒక‌వేళ అలా అనుకునేవాళ్లు ఎవ‌రైనా ఉంటే అహ్మ‌ద‌బాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను చూడండి! ఎంత మంది వ‌చ్చార‌నుకుంటున్నారు? అక్ష‌రాల ల‌క్ష మంది. టెస్ట్ క్రికెట్ హిస్ట‌రీలో ఇదో రికార్డు. ఓ టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు ఇంత పెద్ద మొత్తంలో అభిమానులు రావ‌డం ఇదే మొద‌టిసారి. ఇంత‌కు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పేరిట ఉండేది. 26 డిసెంబర్‌ 2013న మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన బాక్సింగ్‌ డే టెస్టు మొదటి రోజు ఆటను చూసేందుకు 91,092 మంది ప్రేక్షకులు వచ్చారు. నిన్న‌టి వ‌ర‌కు ఇదే అత్యధికం. ఇప్పుడు ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేసింది.

Updated On 9 March 2023 4:44 AM GMT
Ehatv

Ehatv

Next Story