ఐపీఎల్‌-17(IPL-17) సీజన్‌ ఆరంభంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) జట్టు అద్భుతంగా ఆడింది. భారీ స్కోర్లను సాధించింది. టైటిల్‌ గెలుస్తుందేమోనన్న రీతిలో తడాఖా చూపించింది. సెకండ్‌ స్టేజ్‌కు వచ్చేసరికి పేలవంగా ఆడుతోంది. ప్లే ఆఫ్స్‌(Play offs) రేసులో ప్రతీ మ్యాచ్‌ కీలకమన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ముంబాయి ఇండియన్స్‌తో(MI) జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది.

ఐపీఎల్‌-17(IPL-17) సీజన్‌ ఆరంభంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) జట్టు అద్భుతంగా ఆడింది. భారీ స్కోర్లను సాధించింది. టైటిల్‌ గెలుస్తుందేమోనన్న రీతిలో తడాఖా చూపించింది. సెకండ్‌ స్టేజ్‌కు వచ్చేసరికి పేలవంగా ఆడుతోంది. ప్లే ఆఫ్స్‌(Play offs) రేసులో ప్రతీ మ్యాచ్‌ కీలకమన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ముంబాయి ఇండియన్స్‌తో(MI) జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. తద్వారా నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. వాఖండే(Wakande) వేదికగా నిన్న ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌. పోనీ బౌలింగ్‌లోనైనా రాణిస్తుందని అనుకుంటే అక్కడ కూడా అదే సీన్‌. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ ఎనిమిది వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రావిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 48, 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (17 బంతుల్లో 35 నాటౌట్‌, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశారు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (51 బంతుల్లో 102 నాటౌట్‌, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీకి తోడు తిలక్‌ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్‌, 6 ఫోర్లు) రాణించడంతో 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

Updated On 7 May 2024 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story