ఐపీఎల్-2023లో 16వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైకి 173 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ(Rohit Sharma), ఇషాన్ కిషన్(Ishan Kishan ) శుభారంభం అందించారు. రోహిత్ శర్మ 45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్లతో […]
ఐపీఎల్-2023లో 16వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైకి 173 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ(Rohit Sharma), ఇషాన్ కిషన్(Ishan Kishan ) శుభారంభం అందించారు. రోహిత్ శర్మ 45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. సమన్వయ లోపం కారణంగా ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
అనంతరం మూడో స్థానంలో దిగిన తిలక్ వర్మ(Tilak Varma) 41 పరుగులు చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి డకౌటయ్యాడు. చివరి ఓవర్లో చివరి బంతికి టిమ్ డేవిడ్(13) రెండు పరుగులు చేయడంతో ముంబైకి విజయం దక్కింది. అతనికి తోడుగా క్రీజులో కామోరూన్ గ్రీన్(17) ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్(Mukesh Kumar) 2 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ కు ఒక వికెట్ దక్కింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ మినహా మరే ఆటగాడు మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఓపెనర్ పృథ్వీ షా కేవలం 15 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మనీష్ పాండే 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యశ్ ధుల్ రాణించలేక పోయాడు. లలిత్ యాదవ్ విఫలమయ్యాడు. కెప్టెన్ వార్నర్ 47 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ తుఫాన్ ఇన్నింగ్సు ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 172 పరుగులకు చేరుకోగలిగింది.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 3 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రిలే మెరిడిత్ 2 వికెట్లు, హృతిక్ షోకీన్ 1 వికెట్ తీశారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరగగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబై జట్టు 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.