మంగళవారం రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించాడు ధోని
సింపుల్ లైఫ్ జీవించడంలోనే తనకు ఆనందంగా ఉంటుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెబుతూ ఉంటాడు. అందుకు సాక్ష్యాలుగా ఎన్నో ఉంటాయి. ఐపీఎల్ మాత్రమే ప్రస్తుతం ఆడుతూ ఉన్న ధోని.. వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. మంగళవారం రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించారు. ధోని క్యూ లైన్ లో ఆలయాన్ని సందర్శించాడు. అభిమానుల సెల్ఫీలకు కూడా పోజు ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే ఎడిషన్‌లో తన చివరి సీజన్‌ను ఆడాలని ధోని భావిస్తున్నాడు.
మంగళవారం రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించాడు ధోని. దేవరీ మా ఆలయంలోని దుర్గాదేవికి ధోనీ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ధోని దేవరీ మా ఆలయంను సందర్శించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దేవరీ మా ఆలయంలో ఎంఎస్ ధోనీ గతంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. కీలక టోర్నీలకు చేపట్టే ముందు మహేంద్ర సింగ్ ధోని ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి ఆశీర్వాదం తీసుకుంటాడని రాంచీ ప్రజలు చెబుతూ ఉంటారు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ధోనీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడని అతడి మిత్రులు గతంలోనే చెప్పారు.