ఐపీఎల్ 2022(IPL 2023)లో తొమ్మిదో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఈ సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)ను 15 పరుగుల తేడాతో ఓడించి సీఎస్‌కే 10వ సారి ఐపీఎల్ ఫైన‌ల్‌ చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది.

ఐపీఎల్ 2022(IPL 2023)లో తొమ్మిదో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఈ సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)ను 15 పరుగుల తేడాతో ఓడించి సీఎస్‌కే 10వ సారి ఐపీఎల్ ఫైన‌ల్‌ చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఉండవచ్చు.. నాయ‌క‌త్వ‌ ప్రతిభ అతనిలో పుష్క‌లంగా ఉంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో తన మైండ్ గేమ్ తో మరోసారి గేమ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు.

గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ధోనీ తన వ్యూహంతో అత‌డిని పెవిలియన్ కు పంపి విలువైన వికెట్‌ను తీయ‌డానికి కార‌కుడ‌య్యాడు. హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండ‌గా.. ధోనీ మైదానంలో ఆటగాళ్ల ఫీల్డింగ్ పొజిషన్లను మార్చేశాడు. తొలి ఐదు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లను బౌలింగ్ చేయించిన ధోనీ.. ఆరో ఓవర్లో స్పిన్నర్ మహేశ్ తిక్షణ‌ను బౌలింగ్ కు దించాడు. హార్దిక్.. తీక్షణా వేసిన బంతిని మొయిన్ అలీ మీదుగా కట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పాయింట్ ఫీల్డర్ వద్దకు వెళ్లింది. ఇది చూసిన ధోని రవీంద్ర జడేజాను బ్యాక్‌వర్డ్ స్క్వేర్ నుంచి బ్యాక్‌వర్డ్ పాయింట్‌కి పిలిచాడు. జడేజా చేతిలోకి వెళ్లి క్యాచ్ ఔటైన‌ తర్వాతి బంతిని కూడా హార్దిక్ అదే విధంగా షాట్ కొట్టాడు.

మ్యాచ్ అనంత‌రం.. ఫీల్డింగ్ పొజిషన్లు మారుస్తూ ఫీల్డర్లను ఇబ్బంది పెట్టే కెప్టెన్ తానేనని ధోనీ స్వయంగా చెప్పాడు. వికెట్లు పడతాయ‌ని ఆశించినప్పుడు.. ఫీల్డింగ్ పొజిష‌న్‌ మారుస్తాం. కానీ నేను చాలా ఇబ్బందికరమైన కెప్టెన్‌గా ఉంటాను. నేను ఫీల్డర్ల స్థానాన్ని త‌రుచూ మారుస్తూ ఉంటాను. నా ఫీల్డర్‌లకు నా ఏకైక అభ్యర్థన ఏమిటంటే.. వారి దృష్టి నాపైనే ఉంచాలి. క్యాచ్‌ని వదిలేసినా నా వైపు నుంచి ఎలాంటి రియాక్షన్‌ ఉండదు. నా మీద ఓ కన్నేసి ఉంచాల‌ని అన్నాడు.

ధోనీ బ్యాట్‌తో అద్భుతాలు చేయలేకపోవచ్చు.. కానీ మరోసారి తన కెప్టెన్సీతో అద్భుతాలు చేశాడు. అతని కెప్టెన్సీ కారణంగా సీఎస్‌కేకు హార్దిక్ పాండ్యా రూపంలో కీలక వికెట్ లభించింది. ఇది జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి ఉప‌యోగ‌కరంగా మారింది.

Updated On 24 May 2023 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story