ఆసియా క‌ప్‌(Asia Cup) ఫైనల్‌లో భారత్(India), శ్రీలంక(Srilanka) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. టాస్(Toss) గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక(Dhanush Shanka) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణ‌య‌మే వారి కొంప ముంచింది. సిరాజ్() ధాటికి 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆ జ‌ట్టు కుప్పకూలింది.

ఆసియా క‌ప్‌(Asia Cup) ఫైనల్‌లో భారత్(India), శ్రీలంక(Srilanka) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. టాస్(Toss) గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక(Dhanush Shanka) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణ‌య‌మే వారి కొంప ముంచింది. సిరాజ్() ధాటికి 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆ జ‌ట్టు కుప్పకూలింది. త‌ద్వారా భారత్‌పై వన్డేల్లో శ్రీలంక అత్యల్ప స్కోరు న‌మోదుచేసుకుంది. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకను భారత్ 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ చేసింది.

మ్యాచ్ తొలి ఓవ‌ర్‌లో బుమ్రా(Bumrah) తొలి వికెట్ తీయ‌గా.. నాలుగో ఓవర్ తొలి బంతికి సిరాజ్ పాతుమ్ నిస్సాంక వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడో బంతికి సదీర సమరవిక్రమ, నాలుగో బంతికి చరిత్ అసలంక, చివరి బంతికి ధనంజయ్ డిసిల్వా వికెట్లు తీసి లంక‌ను కోలుకోని దెబ్బ తీశాడు. అనంత‌రం బౌలింగ్‌కు వ‌చ్చిన హార్దిక్ పాండ్యా కూడా మూడు వికెట్లు తీశాడు. దునిత్ వెలలాగే, మధుషన్, పతిరానా వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ఏడు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. హార్దిక్ 2.2 ఓవర్లలో మూడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా.. బుమ్రా ఐదు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

Updated On 17 Sep 2023 7:09 AM GMT
Ehatv

Ehatv

Next Story