భారత పేస్ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్(Mohmmad Siraj) 30వ జన్మదినం సందర్భంగా అతనికి బీసీసీఐ(BCCI) శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరక్‌ తన ట్విట్టర్‌లో బీసీసీఐ పోస్ట్ చేసింది. పలువురు క్రికెటర్లు సిరాజ్‌కు పుట్టిన రోజుల శుభకాంక్షలు తెలిపారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ టెండూల్కర్(Tendulker) కూడా సిరాజ్‌కు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది సంతోషంగా గడపడంతో పాటు మరిన్ని వికెట్లు తీయాలని సచిన్‌ ఆకాంక్షించారు.

భారత పేస్ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్(Mohmmad Siraj) 30వ జన్మదినం సందర్భంగా అతనికి బీసీసీఐ(BCCI) శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరక్‌ తన ట్విట్టర్‌లో బీసీసీఐ పోస్ట్ చేసింది. పలువురు క్రికెటర్లు సిరాజ్‌కు పుట్టిన రోజుల శుభకాంక్షలు తెలిపారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ టెండూల్కర్(Tendulker) కూడా సిరాజ్‌కు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది సంతోషంగా గడపడంతో పాటు మరిన్ని వికెట్లు తీయాలని సచిన్‌ ఆకాంక్షించారు. ఆటో డ్రైవర్‌ కొడుకుగా ఉంటూ స్టార్‌ క్రికెటర్‌ స్థానానికి సిరాజ్‌ ఎదిగాడు. తన పుట్టినరోజు సందర్భంగా సిరాజ్ ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇంట్లో డబ్బులు లేనప్పుడు కేటరింగ్ పనులు చేశానని చెప్పుకొచ్చారు. తాను కేటరింగ్ పనులకు వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నలు చదువుకోవాలని చెప్పేవారన్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం తనకు చాలా ఇష్టమని, తన తండ్రి మాత్రం చదువుకోవాలని చెప్పేవారని ఆయన అన్నారు. కేటరింగ్ సర్వీస్‌కు వెళ్తే రెండు వందల రూపాయలు వచ్చేవని 100 లేదా 150 రూపాయలు ఇంట్లో ఇచ్చి మిగితావి ఉంచుకునేవాడినని సిరాజ్‌ అన్నారు. కేటరింగ్‌ సర్వీసులో ఎక్కువగా రుమాలి రోటీ చేసేవాడినని.. ఆ సమయంలో చేతులు బాగా మండేవని సిరాజ్ వివరించారు. చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థితికి వచ్చానని తన వీడియోలో తెలిపాడు.

Updated On 14 March 2024 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story